Thursday 6 April 2017

"కమ్మవారు క్షత్రియులు"...............


1) కవిరాజుత్రిపురనేనిరామస్వామిచౌదరి, ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త, బారిష్టర్ , శతావధాని
2) సూర్యదేవరరాఘవయ్యచౌదరి, బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత, గ్రామాభివృద్ధి ప్రదాత
3) కొసరాజురాఘవయ్యచౌదరి, బాలకవి, అష్టావధాని, జానపద కవిరాజు
4) దుగ్గిరాలరాఘవచంద్రయ్యచౌదరి, సచ్చాస్త్రి ,బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత
5) కొత్తనాగేశ్వర్రావుచౌదరి
6) మాదలరామయ్యచౌదరి................
7) కొత్తసత్యనారాయణచౌదరి,కళాప్రపూర్ణ
8) కొత్తభావయ్యచౌదరి, చారిత్రక పరిశోధకుడు...........

కమ్మవారుక్షత్రియులు, రచన: బాలకవి కొసరాజు రాఘవయ్య చౌదరి.........
సీ. క్షత్రియులమని భుజంబు దట్టినలేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
కమ్మవీరులమంచు గాలుద్రవ్వినలేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
పౌరుషజ్ఞులమంచు బలుక లాభములేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
ఐకమత్యమటంచు నార్భటించినలేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
గీ. ధనికులమటంచు మదిలోన దలచవలదు!
పలుకుబడి గలదంచెదన్ గులకవలదు!
క్షాత్రధర్మంబు జూపెడి సమయమిదియె!
సరసమతులార చౌదరి సభ్యులార!!.....................

"శ్రీమత్పరమహంస గోపాల సచ్చిదానంద బ్రహ్మేంద్ర సరస్వతి స్వాములవారు" క్రీ.శ. 1916వ వత్సరారంభమున #కమ్మవారు శూద్రులను నూహతో వేదాధికారము గలదని కొల్లూరునందు వాదనజేయు తరుణమున కమ్మ, రెడ్డి మున్నగు శాఖలవారు శూద్రులుగారనియు#క్షత్రియులనియు నేవచింప శ్రీ స్వాములవారికిని, సూర్యదేవరరాఘవయ్యచౌదరికును, యందును గురించి కొంతచర్చ జరిగిన పిమ్మట యాశాఖలవారు క్షత్రియులను సూర్యదేవర రాఘవయ్యచౌదరి వాదనను శ్రీస్వాములవారంగీకరించి వారును కొన్ని గ్రంధములు పరిశీలన జేసి #జయార్ధప్రకాశిక ౩వ భాగమున, #కమ్మవారుక్షత్రియులనినిరూపించినారు......................#కమ్మవారుశూద్రులైనవీరుకిరీటాధిపతులైపరిపాలించినరాజ్యమునబ్రాహ్మణులెట్లునివసించిరి.#వారిచేనగ్రహారములనెటుబొందిరి#రాజాధిరాజా,#మహారాజాయని #స్తోత్రములెట్లుజేసిరి?

#బ్రాహ్మణేతరోద్యమము(బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత సూర్యదేవర రాఘవయ్య చౌదరి):-----------

బ్రాహ్మణేతరోద్యమ నిర్మాత సూర్యదేవర రాఘవయ్య చౌదరి, స్వసంఘ పౌరోహిత్యస్థాపనవలనను, సాంఘికసేవవలనను ఆంధ్రరాష్ట్రములో వారిప్పటికిని చిరస్మరణీయులై యున్నారు.ఇంటిపేరు సూర్యదేవరవారగుట వలనను, చిన్నప్పటినుండి#సూర్యవంశీయులమనియు, ప్రత్యేకసథాన గౌరవమున్నదనియు తమ వ్యక్తిత్వనిరూపణకు చిన్నప్పటినుండియు సాంఘికసేవలో నిమగ్నులై యుండెడివారు.రాజకీయములో బ్రాహ్మణులకుతప్ప, యితరకులస్థులకు స్థానములేకపోవుటవలన రాజ్యాధికారము జేపట్టుటకు ప్రత్యేకోద్యమము పానగల్లు మహారాజాధిపత్యయమున ఉమ్మడి మద్రాసురాజధానిగ నున్నప్పుడు జస్టిస్ పార్టీతో నడుపబడినది.దానికి అండగా, సాంఘికవ్యవస్థలో అగ్రకులముగ నున్నబ్రాహ్మణులకు తప్ప యితరకులజులకు స్థానములేకపోవుటచే జి.ఎస్.పి. సరస్వతి(నెల్లూరు) స్వాములవారి బోధననలననుసరించి, స్వసంఘ పౌరోహిత్యము, దాని చిహ్నముగ యజ్ణోపవీతము ధరించుట, గాయత్రీ మంత్ర పఠనము చేయుటమొదలగునవి హిందూమతశాస్త్రము ననుసరించి ఒక బ్రహ్మాండమైన ఉద్యమము లేవదీసి ఆంధ్రదేశములో వాడవాడలా, వేదములు చదువుటకు అన్నివర్ణములకు హక్కుకలదని ఉపన్యాసములిచ్చుచు, బ్రాహ్మణ సహాయనిరాకరణోద్యమము సల్పుచు స్వసంఘ పౌరోహిత్యము, ప్రత్యేకముగ నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి మండలములలో స్వసంఘములు నెలకొల్పిరి. కాని వ్యక్తిగతముగ ఏయొక బ్రాహ్మణుని ద్వేషించువాడుకాదు. దీనికి తార్కాణము రెండవసారి ఆయన గ్రామ ప్రెసిడెంటు పదవికి కేశరనేని అంకినీడుతో పోటీచేసినప్పుడు వైదిక బ్రాహ్మణులే వారిని బలపరచిరి(రచన: కొత్త నాగేశ్వర్రావు చౌదరి.....
(తణుకు నరేంద్ర సాహిత్య మండలి వారిచే1973 సంవత్సరంలో ప్రచురితమైన సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారి రచన ‘కమ్మవారి చరిత్ర’ గ్రంధము నుండి......)

"వర్ణవిభాగచట్టము" ప్రస్తుత మమలులోనున్నదాని ననుసరించి విచారించిన కమ్మవారు క్షత్రియులని యే తెల్లంబగుచున్నది. ఎటులన పుట్టుకచే వర్ణవిభాగంబను నపుడు వంశానుక్రమణి ననుసరించి వర్ణవిభాగము గావింపవలె. అందును గూర్చి యీ#కమ్మవారిపూర్వులెవరాయని విచారింప (ఆంధ్రుల చరిత్ర ద్వితీయ భాగము ననుసరించి) కోట కేతరాజు, కొండపడమటి బుద్ధరాజు కమ్మవారుగ వ్యవహరింపబడినటుల దెలియచున్నది. ఆపురుషద్వయముయొక్క చరిత్రను బట్టిచూడ వారు (1) #దుర్జయ కులాభరుణులమనియు, (2)#బుద్ధవర్మ వంశములోని వారమనియు. (3) చతుర్ధాన్వయులమనియు చెప్పుకొనినటుల విశదమగును. అందు దుర్జయ కులాభరణులనగా #దుర్జయునికులము వారనియు, బుద్ధవర్మ వంశమనగా బుద్ధవర్మనుండి చీలిన శాఖ వారమనియు, చతుర్ధాన్వయులనగా నాల్గవగోత్రము గల వారనియు నర్ధములు. వారుదహరించిన యావాక్యములబట్టి చూడగా కమ్మవారి కాదిపురుషుడు దుర్జయుడైనటుల సద్ధాంతంబగు చున్నది. ఇటుల దుర్జయ కులాభరణులమని చెప్పుకొనినది #కమ్మవారేగాక #కాకతీయులును, #సాగివంశము వారును గలరు. వీరందరికిని మూలపురుషుడైన దుర్జయుడేకులమువాడని విచారించిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి శాసనములో నావిషము సవిస్తరముగా వివరింపబడినది. ఎటులనగా..
గణపతి దేవచక్రవర్తి శాసనమున సూర్యవంశమున మనువు, అతని వంశమున నిక్ష్వాకువు, అతని వంశమున రఘువు, అతని వంశమున దాశరధి, అతని వంశమున గరికాలచోడుడు, అతని వంశమున దుర్జయుడు, అతని వంశమున కాకతీబేతరాజు జనించిరని చెప్పబడియున్నది. (కాని దాశరధి వంశమున గరికాలచోడుడు బుట్టినటుల తత్పూర్వ శాసనములుగాని, చరిత్రలుగాని, పురాణాదులుగాని నిరూపింపలేదు.) దీనినిబట్టి విచారింపగా దుర్జయుడు గరికాలచోడుని వంశములోని వాడనగా చోళులలోనివాడని ధృవంబగుచున్నది.
సదయహృదయులారా! ఇంతదనుక పరిశీలించిన చరిత్రనుబట్టిచూడ (1) కమ్మవారు (2) కాకతీయులు (3) సాగివంశమువారు దుర్జయ కులాభరణులనియు, చోడులలోని వారనియు సిద్ధాంతమైనది. ఈమూడు శాఖలలో కాకతీయులు నేడు మందపాటివారను గృహ నామముతో సూర్యవంశపు క్షత్రియులుగ వ్యవహరింపబడుతున్నారు. కమ్మవారని వ్యవహరింపబడిన కోట కేతరాజు వంశజులు నేడు దాంట్లవారను గృహనామముతో సూర్యవంశపు క్షత్రియులుగ వ్యవహరింపబడుతున్నారు.
వీరందరటుల వ్యవహరింపబడుచుండ నేడు #కమ్మవారిని గురించి యీచర్చ గలిగిన కారణంబేమనగా, వారెల్లరు సూర్యవంశజులుగ వ్యవహరింపబడుట గణపతిదేవ చక్రవర్తి కిటీవలనేగాని తత్పూర్వము లేదు. పూర్వమువారు వైదిక మతమెరుగ నపుడు తమ దేవర్ణమో నిరూపణజేయక పిమ్మట వైదిక మత ప్రచారకులు మనదేశము వచ్చిన వెంటనే సూర్య చంద్ర వంశములకు భిన్నమైన క్షత్రియ కులముగ నిరూపణ జేయుట నటువెన్క తాము వైదిక మతమవలంబించిన దాది సూర్యవంశపు క్షత్రియులుగ బేర్కొన సాగిరి. ...
అశౌచవిధి ననుసరించి విచారింప ‘మానశూద్ర స్వకీర్తితః’ అని శూద్రునకు నెలదినము లశౌచవిధి చెప్పియున్నది. ఈ కమ్మవారు పదునైదు దినములే అశౌచ విధి జరుపుటచేత శూద్రు లనరాదు. ఇంతయేల? ‘నశూద్రరాజ్యేని వసేత్’ అని శాస్త్రవచనము లున్నవిగదా! ఈ #కమ్మవారుశూద్రులైనవీరుకిరీటాధిపతులైపరిపాలించినరాజ్యమునబ్రాహ్మణులెట్లునివసించిరి.#వారిచేనగ్రహారములనెటుబొందిరి? #రాజాధిరాజా, #మహారాజాయని #స్తోత్రములెట్లుజేసిరి? ఈవిషయములన్నియు నిష్పక్షపాతబుద్ధితో పరిశీలించినవారికి #కమ్మవారుశూద్రులుగారని తోపకపోదు. అట్లు జూడక వాదించువారికి వందనము లర్పించెదగాక! వేరు వివరింపజాలనని చెప్పి విరమించెను. అంతట శ్రీయుత #దుగ్గిరాలరాఘవచంద్రయ్యచౌదరిగారు లేచి యిట్లుపన్యసించిరి.....












శతావధాని త్రిపురనేని రామస్వామి చౌదరిగారిప్రతివాదము------------.
1. నిజముగ సద్బ్రాహ్మణులకుగాని, సుక్షత్రియులకుగాని యుపనామములయిన శర్మ, వర్మ శబ్దములు మున్నెన్నడు తగిలించుకొనియుండెడి యాచారము లేదు. నిస్సారులై యాచారవ్యవహారాదులచే గుర్తింపబడరేమో యను శంకచే ప్రేమతోనైన గుర్తింపబడుటకు నీదారిత్రొక్కిరి. ఇందుచేతనే ద్రోణశర్మ యనిగాని వసిష్టశర్మ యనిగాని దుర్యోధనవర్మ యనిగాని భీష్మవర్మ యనిగాని లేదు. సుక్షిత్రియత్వము శంకాస్పదమైన కృతవర్మకే వర్మయను నామము కలదు. ఇంతమాత్రముచే వసిష్టాదులను బ్రాహ్మణులు కారనియు, దుర్యోధనాదులను క్షత్రియులు కారనియు జెప్పదగునా? నిజముగా చైనులుగారి తండ్రికి చైనులుగారని యుపనామము లేదు. అంత మాత్రముననే చైనులు చైనులు తండ్రి కుమారుడు కాడని చెప్పదగునా? న్యాయమగునా? వీరికి నుపనామములుగా నున్ను నేడు నీడు రాయణ రెడ్డి మొదలగు నామములే క్షత్రియత్వ సూచకములు.
2 . ముక్త్యాల జమీందారు తాను విష్ణుపాదోద్భవుడనని తాగృతిపొందిన గ్రంధములో వ్రాయించుకొన్నాడు. కావచ్చును. అంత మాత్రముననే మావాదమునకు నష్టమేమో బోధపడదు. విష్ణుపాదోద్భవులు క్షత్రియులు కారనియు, శూద్రులేయనియు, నెచ్చటను చెప్పబడియుండలేదు. ప్రజాపతి పాదములయందు శూద్రులు పుట్టినారని చెప్పబడియున్నది. కాని విష్ణు పాదమునందనికాదు. ఒకవేళ నట్లున్నచో ప్రజాపతియు, విష్ణువును తన్నులాడుకొని, నిశ్చయము తేల్చుకొన్నప్పుడాప్రసంగము చేయవచ్చును. ముక్త్యాల జమీకి మాతృస్థానమయిన నమరావతి దేవాలయములో నొక శిలాశాసనమున్నది. అందీ పద్యమున్నది.
ఉ. రాజిత కీర్తిశాలురు కరంబున గమ్మకులోద్భమల్ భర
ద్వాజ మునీంద్ర గోత్రీజులు......................
దీని కర్ధమేమి చెప్పవలయు.
3 . క్షత్రియులైనచో క్షత్రియా శౌచవిధియే వీరాచరించుచుండెడివారట. అగుచో, శూద్రులకు స్మృతులు ముప్పది దినముల శౌచవిధి చెప్పుచుండగా వీరు ౧౫ దినములే యవలంబించు చున్నారు. ఇది యెట్లు?
4 . కూర్మ శబ్దభవము కమ్మకాక కుమ్మరేయగుచో విప్రశబ్దము, ఉప్పరయేల కాకూడదు.
5 . స్కాంద పురాణములో జాతిభేదము గలవానికి గూర్చి చెప్పబడినది కాని వేరుకాదు. అయ్యది యచ్చట నొసగబడిన యుదాహరణనుబట్టి స్పష్టము కాగలదు. గాడిద గుర్రము కానేరదు గాని చెడిపి గుర్రము మంచిగుర్రమేలకాదొ, మంచిగుర్రము చెడిపియేలకాదో బోధపడదు? మానవులందరు నొక్క ప్రజాపతినుండియే యుద్భవించినప్పుడు జాతిభేదమెట్లు వాటిల్లి నదో చెప్పుటయయితికాదు. ఎల్లరును మనుసంతానమగుటచేతనే మానవశబ్ద వాచ్యులైరికదా? గుర్రమును గాడిదను నేర్పరుపగలముకాని మనుజులయందు చూచి చూచుటతోడనే వర్ణవిభాగము చేయలేముగదా.
6. ఒక్క జన్మమునందే వర్ణాంతరమును బొందిన మహానుభావులు భారత భాగవతమునందలి వంశవృక్షమును పరీక్షించి చూచిన యెడల బోధపడగలదు. కుటుంబములు, కుటుంబములు వర్ణాంతరమును బొందినట్లు గన్పట్టు.
7. జర్మనులు, మహమ్మదీయులు హిందువులుకారు. హిందువులనుగూర్చి యేస్మృతులు వాకొనినవి. ఇట్టి సందర్భములో హింద్వేతరులను గూర్చి మాటాడుట యవివేకము.
పెక్కుమాటలేల? ఏనాడు బ్రాహ్మణులు రెడ్డి, వెలమ, కమ్మ ప్రభ్రుతులచే పరిపాలింపబడుచున్న తెలుగుదేశమున కాపురము చేయుట కారంభించిరో, యానాడే పైవాకొనబడిన జాతులు క్షత్రియ శాఖలైనను కావలయును, లేదా బ్రాహ్మణులు, బ్రాహ్మణులైనను కాక పోవలయును.
--------------- ............................ ------------------