Wednesday 8 February 2017

#కాంభోజసామ్రాజ్యం#కమ్మవారిమూలపురుషులు#కమ్మక్షత్రియకాంబోజమహాజనపద#కమ్మరాజవంశాలు............................................
(#కమ్మరాష్ట్రం#కమ్మరథం#కమ్మనాడు#కమ్మక్షత్రియ / #కమ్మరాష్ట్రము#కమ్మరట్టము#కమ్మకరాటము#కర్మరాష్ట్రము#కర్మకరాటము#కర్మకరాష్ట్రము మరియు #కమ్మకరాష్ట్రము)......................................


"భారతం"లో మనం విన్న కొన్ని దేశాల పేర్లు …...........కురు, పాంచల, వత్స, కోసల,కాసి, వైదేహ, దక్షిణ కోసల, మల్ల, సురసేన, ద్వారక, అనర్త, సౌరాష్ట్ర, హెహేయ, నిషాధ, గుర్జర, కరుష, చేది, దసర్న, కుంతి, అవంతి, మాలవ, మత్స్య, త్రిగర్త, సాళ్వ, మద్ర, సింధు, సౌవీర, సివి, కేకేయ, గాంధార, యౌధేయ, పహ్లవ, బాహ్లిక, పరమ కాంబోజ, ఉత్తర మద్ర, ఉత్తర కురు, యవన, ఖాస, శాక్క, కాశ్మీర, కాంబోజ, దారద, పరద, పారసిక, తుషార, హున, హార హూన, రిషీక, చైన, పరమ చైన, మగధ, కీకట, అంగ, ప్రజ్ఞోతిష, సోనిత, లౌహిత్య, పుండ్ర, సుహ్మ, వంగ, ఓడ్ర, ఉత్కళ, విదర్భ, అనుప, సూర్పరక, నాసిక్య, కొంకణ, అస్మాక, దండ, కళింగ, తెలింగ, ఆంధ్ర, కిష్కింధ, గోమంత, కర్నాట, కంచి, చోళ, పాండ్య, తుళు, ముషిక, సత్యాపుత్ర, కేరళ, సిణళ, సారస్వత, అభిర, సూద్ర, నిషాద, కింపురుష, పిశాచ, నాగ, కిన్నర, యక్ష, గంధర్వ, కిరాత, హిమాలయ, పర్వత, నేప, సృనాజయ, బాళిక, హైహాయులు, వృష్ణి, అంధక, అవంతి, కుకూర, అంగ, కళింగ, మద్ర,సౌవీర, #కాంబోజ, సింధు, భోజ, యవన, మ్లేలేచ్చ, వైకర్ణ, చేది.........
హిందూకుష్ పర్వత పంక్తుల మొదలు లడఖ్, టిబెట్ ప్రాంతాల వరకు వ్యాపించివున్న సుందరమైన ప్రాంతాన్ని అనాదిగా '#కాంబోజదేశం' అనేవారు. అది అందమైన గుర్రాలకూ, మెత్తని గొర్రెబొచ్చు (పష్మీనా)తో నేసిన అందమైన శాలువాలకూ ప్రసిద్ధి పొందింది. ఎలుక, కుక్క బొచ్చులతో చేసిన చర్మపు ఉడుపులకు కూడా ఈ కాంబోజ దేశం అనాదిగా ప్రసిద్ధి పొందింది. అక్షోటక (అక్రోటు - Walnut) వృక్షాలకు కూడా కాంబోజ దేశం మొదట్నుంచీ పేరొందింది. #కాంబోజ ప్రాంతం ప్రస్తుత ఆఫ్ఘనిస్థానేనని భావించబడుతున్నది. ఒకప్పుడు ఇక్కడ బౌద్ధం పరిఢవిల్లింది. క్రీస్తు పూర్వం రెండు, మూడు శతాబ్దాలలోనే ఇక్కడి నుంచి సూర్య వంశీయులైన '#కమ్మో' లనే జాతి ప్రజలు బౌద్ధమత వ్యాప్తి కోసం పల్లవ భోగ్య (పలనాడు) కు వలస వచ్చారని పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణ కోసల ప్రాంతం నుంచి వచ్చి నాగార్జున కొండ ప్రాంతంలో స్థిరపడిన సూర్య వంశీయులైన ఇక్ష్వాకులతో కమ్మోలు వైవాహిక బంధాలను ఏర్పరచుకున్నారట. విజయపురి రాజ్యంలో వీరపురుషదత్తుని 21 సంవత్సరాల పాలనాకాలంలో కమ్మోలకు బౌద్ధమత వ్యాప్తిలో మంచి ప్రోత్సాహం లభించింది. అనంతరకాలంలో హిరణ్య రాష్ట్రంగా పేరొందిన కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో చాళుక్య రాజ్యం స్థాపించిన 'స్కంద చలికి రెమ్ణకుడు' (సలికి రెమ్మణ్ణకుడు) #కమ్మోజాతికి చెందినవాడని, చలికి లేక సలికి ఇంటిపేరు కలవారు వారు ఈనాటి #కమ్మవారి లోనూ ఉన్నారనీ, వారిది రత్నాల గోత్రమనీ, కనుక కమ్మో జాతీయులు నేటి #కమ్మవారి మూలపురుషులే అయి ఉంటారనీ పరిశోధకులు భావిస్తున్నారు. వీరి కారణంగానే #కాంబోజరాజు కథలు తెలుగు జానపద సాహిత్య సంపదలోకి వచ్చి చేరి ఉంటాయి. ఈ ప్రాంతం అనాదిగా #కమ్మ ప్రాబల్యమున్న ప్రాంతమే కనుక ఇది సత్యమే కావచ్చు. కానీ, కృష్ణా నదీ ముఖద్వారానికి సమీపానగల ప్రతీపాలపురం (బట్టిప్రోలు)ను పాలించిన ఇక్ష్వాకు పాలకుడు కుబేరకుడి గురించి 'ధర్మామృతం' అనే జైన గ్రంథంలో కొన్ని ప్రస్తావనలు లభించాయే గానీ, ఈ కమ్మోల గురించిన ప్రస్తావనలు మాత్రం ఆ గ్రంథంలో ఎక్కడా కానరాలేదు. బౌద్ధ, జైన మతాలు ఆ ప్రాంతంలో ఆదరణ కోల్పోవడంతో ఆ యా మతాలకు చెందిన తాళపత్ర గ్రంథాలు, శాసనాలు వంటి పలు లిఖిత ఆధారాలు మతేతరుల చేతిలో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అందుకే చారిత్రకులు దొరకిన ఆధారాల సాయంతో చరిత్రలో వెలుగు చూడని అంశాలను వెలికితీయాల్సి ఉంది. నిస్సందేహంగా ఇది చాలా కష్టసాధ్యమైన పనే. ఇకపోతే భారతీయ సాంస్కృతిక సామ్రాజ్యంలో భాగమైన ఆగ్నేయాశియా రాజ్యాలలోనూ ఒక కాంబోజ ఉంది. అది ఒకప్పటి కాంబోడియా (నేటి కంపూచియా).............
(#కమ్మరాష్ట్రం/ #కమ్మరథం/ #కమ్మనాడు/ #కమ్మక్షత్రియ)..........................
కమ్మనాడు/ కమ్మరాష్ట్రం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము నెల్లూరు, పడమర శ్రీశైలం, ఉత్తరం ఖమ్మం హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.
#కర్మరాష్ట్రము లోని భట్టిప్రోలు, ధరణికోట, విజయపురి శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి.
#కమ్మరాష్ట్రంశాసనములు..........
1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని బేతవోలు (జగ్గయ్యపేట) శానములో గలదు (3వ శతాబ్దము).
2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని చెందులూరు గ్రామశాసనములో దొరికినది.
3. మూడవ ఆధారము తూర్పు చాళుక్య రాజు మంగి యువరాజ (627-696) శాసనము:
శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే
4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి.
5. రాజరాజనరేంద్రుని సమకాలీకుడగు పావులూరి మల్లన (1022-1063) ఈ విధముగా వ్రాసెను:
ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్
6. తెలుగు చోడుల మరియు కాకతీయుల శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన (కొణిదెన) రాజధానిగా పాలించుచుండెను.
#కాకతీయుల, #ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని #కమ్మ అను పదము మాత్రము ఒక సామాజిక వర్గము (కులము)నకు పేరుగా మిగిలిపోయినది.............
#కమ్మవారుకాంబోజఆర్యులుకమ్మక్షత్రియులు..........................
సూర్యచంద్ర వంశాలు అంతరించిన తరువాత 16 షాడోమహాజన ఆర్య క్షత్రియజాతులు ఏర్పడ్డాయి వాటిలోనిదే ఖంభోజ అనే క్షేత్రీయ జాతి ఒకటి ఆ #కాంబోజ నుండే కమ్మ కుంబి కుర్మి కుర్మా కంబళి క్షత్రియులు ఏర్పడ్డారు. త్రిలింగదేశం నందు కమ్మక్షత్రియులు పాలన సాగించారు. ఒకప్పటి త్రిలింగ థేసమ్ అదే ఆంధ్రదేశం (తెలుగు జాతి) నెడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. అప్పుడు మూడవ సత్తాబ్డం ఈ కలంలో ఈ ప్రాంతాన్ని కమ్మరాష్ట్రం కమ్మనాడుగా పిలిచెవారు కమ్మనాడు ని పాలించే వారిని కమ్మప్రభులుగా పిలిచేవారు. కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో #కమ్మవారిదుర్జయవంశపురాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ #కమ్మదుర్జయవంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధా తధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మనాయకుల రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారె #పెమ్మసాని #సాయపనేని #రావెళ్ల #సూర్యదేవర #వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి . కావునకమ్మవారుకాంబోజఆర్యులుకమ్మక్షత్రియులు.....................
భాస్కరాచార్య అనే ఆయన రాసిన ‘#కన్యకాపురాణం' లో ‘#కమ్మటవారనుకమ్మవారిని జేరి రిన్నూరు గోత్రాల హీనమతులు' అని ఉండడాన్నిబట్టి, కాంభోజ ప్రాంతం నుంచి బౌద్ధ మత ప్రచారం నిమిత్తం వచ్చిన ‘కమ్మో' లు అనే బౌద్ధులు, కూర్మీలలో అంతర్భాగంగా ఆంధ్రకు వచ్చి స్థిరపడిన జైనులు మాత్రమే కాక ఒకానొక చారిత్రక దశలో వ్యావసాయకులుగా ఉన్న వైశ్యుల నుంచి కూడా రెండువందల గోత్రాల వారు - వీరంతా కలిసి ఆంధ్రదేశంలో #కమ్మకులం గా ఏర్పడ్డారు........................."#కమ్మకులస్థుల, #కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు & #కమ్మరాష్ట్రం":----.అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.............. కూర్మారాధక కురమ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి #కమ్మకులంగా ఏర్పడడారు.............తుళునాడులో స్థానిక కన్నడిగులు వారిని 'బంట' అనే పేరుతో వ్యవహరించారని అంటారు.వారు #కమ్మవారికీ, #కాకతీయులకీ, #తుళువ వారికీ మూలపురుషుడైన తుర్వసుడి వంశీయులమని చెప్పుకున్నారు కనుక తుళువ (రాయలు తండ్రి తరఫు) వారు మిగిలిన అన్ని కులాల కంటే కమ్మ కులానికే దగ్గరవారని నా స్థిరాభిప్రాయం. రాయలు తల్లి నాగులాంబ గండికోట పెమ్మసాని కమ్మవారి ఆడపడుచు........................... కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "#దుర్జయులు"........................చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.
#కమ్మవారు ఆంధ్ర దేశాన్ని పాలించారు......................






###"""""#ప్రధానకమ్మరాజవంశాలు - #రాజ్యాలపరంపర #కమ్మనాయకరాజులు"""""####.....................................
1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము
2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు)
3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి,ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు)
4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు)
5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు)
6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు)
7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు)
8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు)
9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు)
10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

.#ప్రధానకమ్మరాజసంస్థానాలు.............#కమ్మజమీందారులు......
#చల్లపల్లి సంస్థానం - యార్లగడ కమ్మరాజ వంశం
#పెద్దవెంగీ సంస్థానం - యర్లగడ్డ కమ్మరాజ వంశం
#అమరావతి సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#ముక్త్యాల సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#చింతపల్లి సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#జయంతిపురం సంస్థానం - వాసిరెడ్డి కమ్మరాజ వంశం
#ఉండ్రాజవరం సంస్ధానం - ముళ్లపూడి కమ్మరాజ వంశం
#కపిలేశ్వరపురం సంస్థానం - బలుసు కమ్మరాజ వంశం
#కురివికులము సంస్థానం - పెమ్మసాని కమ్మరాజ వంశం (TamilNadu)
#ఇలైయరసనందాల్ సంస్థానం - రావెళ్ళ కమ్మరాజ వంశం (TamilNadu)
#దొమ్మేరు సంస్థానం - పెండ్యాల కమ్మరాజ వంశం
#చిట్టూరి సంస్థానం - చిట్టూరి కమ్మరాజ వంశం
#రంగాపురం సంస్థానం - అడుసుమిల్లి కమ్మరాజ వంశం
#తణుకు సంస్థానం - ముళ్లపూడి,పెండ్యాల కమ్మరాజ వంశం
#సేవలపట్టి సంస్థానం - బెల్లం కమ్మరాజ వంశం (TamilNadu)
#నిన్యానన్ధల్ సంస్థానం - గోళ్ళ కమ్మరాజ వంశం (Ramanadhapuram) (Tamilnadu)
#తిరువత్తూరు సంస్థానం - గోళ్ళ కమ్మరాజ వంశం (Ramanadhapuram) (Tamilnadu)
#నికరపట్టి సంస్థానం - పెమ్మసాని కమ్మరాజ వంశం (TamilNadu)...................................................................................................