Thursday 4 May 2017


కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "#దుర్జయులు"........................
కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది కమ్మనాడు,వెలనాడు ఉంది.కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం..........
1) #చంద్రవంశక్షత్రియులలోని ఒకానొక శాఖ “”#దుర్జయవంశీయులు””, చంద్రవంశ క్షత్రియ మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “”దుర్జయాన్వయులు”” – “”కాకతీయులు”” మొదలైన కమ్మవారి మూల పురుషులు………………….
2) “”#కమ్మవారికీ#కాకతీయులకూ”” మూలపురుషుడైన “”#కమ్రమహారాజు”” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కురమ అనే కులంగా ఏర్పడ్డారు…………………………………………………………..
3) “”#కాకతీయులు”” తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “”జైన మతంలో”” ఉండగా “”కుల గోత్రాలను”” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక శూద్రులుగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘ అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు…………….
కాకతీయులు-దుర్జయ వంశస్థులు……….కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది “”(కమ్మ నాడు, కమ్మ రాష్ట్రాలు)వెలనాడు”” అని కైఫీయత్తుల్లో ఉంది.””కమ్మ”” వారికి మూల పురుషు లైన “”దుర్జయులకు”” ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం…………
1)శాసనాధారాలను బట్టి “#బయ్యారంశాశనం” ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
2) “#గూడూరుశాసనం”లో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.
3) “#చేబ్రోలుశాశనం” ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన – బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు……..
4) #గవరపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు #దుర్జయుని కారణo గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....
భాస్కరాచార్య అనే ఆయన రాసిన ‘#కన్యకాపురాణం' లో‘#కమ్మటవారనుకమ్మవారిని జేరి రిన్నూరు గోత్రాల హీనమతులు' అని ఉండడాన్నిబట్టి, కాంభోజ ప్రాంతం నుంచి బౌద్ధ మత ప్రచారం నిమిత్తం వచ్చిన ‘కమ్మో' లు అనే బౌద్ధులు, కూర్మీలలో అంతర్భాగంగా ఆంధ్రకు వచ్చి స్థిరపడిన జైనులు మాత్రమే కాక ఒకానొక చారిత్రక దశలో వ్యావసాయకులుగా ఉన్న వైశ్యుల నుంచి కూడా రెండువందల గోత్రాల వారు - వీరంతా కలిసి ఆంధ్రదేశంలో #కమ్మకులం గా ఏర్పడ్డారు.........................
"#కమ్మకులస్థుల, #కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు & #కమ్మరాష్ట్రం":----.
అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.............. కూర్మారాధక కురమ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి #కమ్మకులంగా ఏర్పడడారు.............తుళునాడులో స్థానిక కన్నడిగులు వారిని 'బంట' అనే పేరుతో వ్యవహరించారని అంటారు.వారు #కమ్మవారికీ, #కాకతీయులకీ, #తుళువ వారికీ మూలపురుషుడైన తుర్వసుడి వంశీయులమని చెప్పుకున్నారు కనుక తుళువ (రాయలు తండ్రి తరఫు) వారు మిగిలిన అన్ని కులాల కంటే కమ్మ కులానికే దగ్గరవారని నా స్థిరాభిప్రాయం. రాయలు తల్లి నాగులాంబ గండికోట పెమ్మసాని కమ్మవారి ఆడపడుచు...........................
చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు #దూర్జయకులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు........
#కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో #కమ్మవారిదుర్జయవంశపురాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ #కమ్మదుర్జయవంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధా తధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మనాయకుల రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారె #పెమ్మసాని #సాయపనేని #రావెళ్ల #సూర్యదేవర #వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి.........
దుర్జయమహారాజు

No comments:

Post a Comment