Thursday 5 January 2017

 'ఆంధ్రదేశాధీశ్వర'  'ఆంధ్రసురత్రాణ'  ముసునూరి  కాపయ నాయకుడు / కాపానీడు, కమ్మ దుర్జయ వంశము.................


'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' ముసునూరు కాపయ నాయకుడు

ముసునూరి కాపానీడు

ఆంధ్ర లేక తెలుగు దేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించ దగిన నాలుగు పేర్లు శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణికాకతీయ గణపతిదేవ, ముసునూరి కాపానీడు మరియు శ్రీ కృష్ణదేవరాయలు. వీరందరూ తెలుగుదేశ ఐక్యతకూ, తెలుగు వారి స్వాతంత్ర్యమునకూ, వారి ఉన్నతికీ పాటుబడిన యుగపురుషులు.
కాపానీడు లేక కాపయ నాయకుడు ముసునూరి నాయకులు వంశమునకు చెందిన ప్రోలయ నాయకుని పిన తండ్రి దేవ నాయకుని కుమారుడు. కాపానీడు ప్రోలయకు కుడి భుజము వంటివాడు. ప్రోలయ నాయకత్వము క్రింద తెలుగు నాయకులు చేసిన విముక్తి పోరాటము ఫలించి క్రీ.శ. 1326లో (ఫిబ్రవరి-ఏప్రిల్ మాసముల మధ్య) తీరాంధ్రదేశము విముక్తమైనది. హిందూధర్మము పునరుద్ధరింపబడింది. విలస తామ్ర శాసనములో ప్రోలయ ఘనత శ్లాఘించబడినది[1]. వయోభారముతో ప్రోలయ రాజ్యాధికారాన్ని కాపానీడుకు అప్పగించి రేకపల్లి కోటకు తరలిపోతాడు. ఆతని వాంఛ తెలుగు దేశమును పూర్తిగా మ్లేఛ్ఛుల నుండి విముక్తి చేయుట.
తెలంగాణమునుకూడ ముస్లిములబారి నుండి విడిపించి అచట హిందూరాజ్యమును పునహ్ ప్రతిష్ఠాపించుటే కాపానీడు ఏకైక లక్ష్యము. ఇందు నిమిత్తము పొరుగు హిందూరాజులతో రాయబారములు నడిపి సైన్యమును వృద్ధిచేసుకొని తరుణమున కెదురుచూచుచుండెను. అద్దంకిలో వేమారెడ్డి, కృష్ణా-తుంగభద్ర అంతర్వేదిలో అరవీటి సోమదేవ రాజు, ద్వారసముద్రములో హోయసల బళ్ళాలుడు, కంపిలిలోని ప్రజలకు ఒకే ఆశయము-స్వాతంత్ర్యము. బళ్ళాలుని తిరుగుబాటు అణచుటకు మహమ్మద్ బీన్ తుగ్లక్ ఢిల్లీలో మతము మార్చబడి బందీలుగానున్న హరిహరబుక్క సోదరులను పంపుతాడు. ఇదే సమయములో మధురలో జలాలుద్దీన్ స్వతంత్రుడవుతాడు. ఓరుగంటిలో కాపానీడు తిరుగుబాటు లేవదీస్తాడు. బళ్ళాలుడు అశ్వికదళమును, పదాతి సైన్యమును తోడంపుతాడు. కోట ముట్టడిలో భయంకర పోరు జరుగుతుంది. దుర్గపాలకుడు మాలిక్ మక్బూల్అతికష్టముమీద పారిపోతాడు. క్రీ. శ. 1336లో ఓరుగంటికోటపై మరలా ఆంధ్ర పతాకము ఎగిరింది. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసురత్రాణ బిరుదులతో కాపానీడు తెలుగు దేశమునకు అధిపతి అయ్యాడు. కాపానీడు విజయముతో స్ఫూర్తినొంది, విద్యారణ్యుని ఆశీస్సులతో హరిహర-బుక్క సోదరులు కంపిలిలో స్వాతంత్ర్యము ప్రకటించుకుంటారు.

రాజ్యము

కాపానీడు తనకు సహకరించిన బంధువులకు, నాయకులకు పదవులిచ్చి తన స్థితిని కట్టుదిట్టము చేసుకుంటాడు. పినతండ్రి రాజనాయకుని కుమారుడు అనవోతానాయకుని మధ్యాంధ్రదేశమునకు అధిపతిగా నియమిస్తాడు. ఈతనికి తొలుత తొయ్యేడు, పిదప రాజమహేంద్రవరము రాజధాని. గోదావరికి దక్షిణమున సబ్బినాటికి ముప్పభూపాలుని అధిపతి గావించాడు. కోరుకొండలో మంచికొండ కూనయ నాయకుని నియమించి తన మేనకోడలును కూనయ కుమారుడు ముమ్మడి నాయకునికిచ్చి వివాహము చేస్తాడు. అద్దంకిలో వేమారెడ్డి కాపయకు సామంతుడై పాలన సాగిస్తాడు. పిఠాపురము రాజధానిగా గోదావరీ తీర ప్రాంతము మొదలుకొని తుని వరకు కొప్పుల నామయ నాయకుడు పాలకుడు. ఈవిధముగా కాపయ రాజ్యము పశ్చిమాన కౌలాస్బీదరు మొదలుకొని తూర్పున బంగాళాఖాతము వరకు, ఉత్తరమున కళింగము నుండి దక్షిణమున కంచి వరకు వ్యాపించియున్నది.

యుద్ధములు

కాపానీడు మనసులో ఢిల్లీ సుల్తాను మరలా ఎప్పుడు తెలుగు దేశముపై దండెత్తివచ్చునో అను సందేహము పోలేదు. ఓరుగల్లు మొదలైన ముఖ్య దుర్గములు పటిష్ఠము చేయించాడు. సేనలను వృద్ధి పరచాడు. ఈ సమయములో దక్కనులో జాఫర్ ఖాన్ హసన్ అనువాడు ఢిల్లీ సుల్తానుపై తిరుబాటు చేసి కాపానీడు సాయమడుగుతాడు. పదునైదు వందల పదాతి సేనను పొంది, సుల్తాను సేనలపై విజయము సాధించి గుల్బర్గా (కలుబరిగె) రాజధానిగా క్రీ. శ. 1347లో బహమనీ రాజ్యము స్థాపిస్తాడు. ఈతడే కాపానీడు పక్కలో బల్లెముగా కాబోయే జాఫర్ ఖాన్ అలావుద్దీన్ హసన్ గంగూ బహ్మన్ షా.
జాఫర్ ఖాన్ ఎంత కృతఘ్నుడో కాపానీడుకు త్వరలోనే తెలిసి వచ్చింది. పొరుగుననున్న హిందూ రాజ్యములను సాధించిన జాఫర్ ఖాన్ కాపానీడుపై దండెత్తుతాడు.

మొదటి పోరు

అత్యంత విషమ పరిస్థితిలో సహాయము చేసెనను కృతజ్ఞత కూడా లేకుండ జాఫర్ ఖాన్ అలావుద్దీన్ ఓరుగంటి రాజ్యముపై దండెత్తాడు. ఊహించని ఈ పరిణామములో కాపానీడు సేన ఓడిపోతుంది. విధిలేక కౌలస కోటను అప్పగించి కాపానీడు సంధి చేసుకుంటాడు.

రెండవ పోరు

క్రీ. శ. 1351లో ముహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయాడు. దీనితో అలావుద్దీన్ కు ఏ భయమూ లేకుండా పోయింది. రాజ్యవిస్తరణాకాంక్షతో, కాపానీడుని సామంతుడిగా చేసుకొనుటకు యుద్ధము ప్రకటిస్తాడు. తురుష్క యుద్ధ తంత్రములో భాగముగా కోటల బయటనున్న సామాన్య ప్రజలను హింసించుట, నిస్సహాయులైన వృద్ధులను, బాలలను సంహరించుట, స్త్రీలపై అత్యాచారములు చేయుట, గ్రామములు తగులబెట్టుట మొదలగు అకృత్యాలు చూసి భరించలేక కాపానీడు సంధికి ఒడబడి ఢిల్లీ సుల్తానుకు ఎంత కప్పం కట్టేవాడో అంత చెల్లించుటకు ఒప్పుకుంటాడు. అలావుద్దీన్ భువనగిరి కోట స్థావరముగా ఒక సంవత్సరము పాటు తెలంగాణములో ఉండి దేశమంతయూ ధ్వంసం కావించాడు. మాలిక్ కాఫుర్ దాడి పిదప మిగిలిన దేవాలయములు కూడా ధ్వంసము చేసి వాటి స్థానములో మసీదులు కట్టించాడు.

మూడవ పోరు

క్రీ.శ. 1359లో అలావుద్దీన్ చనిపోయాడు. ఆతని కొడుకు మహమ్మద్ షా రాజ్యానికొస్తాడు. ఈ సందర్భమున విజయనగర రాజు బుక్కరాయలు, ఆంధ్రదేశాధిపతి కాపానీడు తండ్రి అలావుద్దీన్ తమవద్దనుండి లాగుకొనిన రాజ్యమును తిరిగి ఇవ్వవలసిందిగా మహమ్మద్ షా వద్దకు రాయబారులను పంపుతారు. షా తెలివిగా రాయబారులను ఒక సంవత్సరము ఆపి వుంచి, తనకు పంపవలసిన కప్పము ఎందుకు పంపలేదని అడుగుతాడు. ఉగ్రుడైన కాపానీడు పెద్ద సేనతో, కొడుకు వినాయక దేవుని కౌలస కోట పట్టుకొనుటకు పంపుతాడు. సాయముగా బుక్కరాయలు 20,000 అశ్వికులను పంపుతాడు. మహమ్మద్ షా మొదట విజయనగర సైన్యమును ఓడించి, దేశమును కొల్లగొట్టి, గుర్రాలతో గుల్బర్గాకు తిరిగివెళ్ళుతూ వినాయకదేవునితో తలపడి ఓడిపోతాడు. భువనగిరి తిరిగి ఓరుగల్లు వశమయ్యింది. వెనువెంటనే మహమ్మద్ షా సేనాధిపతి బహాదూర్ ఖాన్ వినాయకదేవునిపై దాడిచేసి ఓడించాడు. ఆతడు పట్టణము పారిపోయి దాక్కుంటాడు. బహాదూర్ ఖాన్ ఓరుగల్లు వరకు దేశము పాడు చేశాడు. అపారధనము, అమూల్యాభరణాలు, 25 ఏనుగులు ఇచ్చి కాపానీడు సంధి చేసుకుంటాడు.

నాలుగవ పోరు

క్రీ.శ. 1362లో మహమ్మద్ షా మరలా వినాయకదేవునిపై దండెత్తుతాడు. తనకు దక్కవలసిన అరబ్బీ గుర్రాలను దారి మరల్చాడని పోరు సాకు. నాలుగువేల అశ్వికులతో ఆకస్మికముగా పట్టణము పైబడి అచటి హిందువులందరినీ దారుణముగా క్రూరవధ పాలు చేశాడు. కోటను ముట్టడించి వినాయకదేవుని బంధించాడు. నిర్భయముగా ఎదురు సమాధానము చెప్పిన ఆతని నాలుక కోయించి, క్రింద రగిల్చిన మంటలో పడునట్లు కోట బురుజు పైనున్న ఫిరంగివాత నుండి విసిరివేయించాడు.
మహమ్మద్ షా చేసిన క్రూర దారుణ చర్యలకు కోపించిన తెలుగు ప్రజలు, సైన్యము షా దారికాచి తురుష్కులను పీడించారు. పట్టణ సంపద కొల్లగొట్టి, దేశమంతయూ తగులబెట్టమని ఆజ్ఞాపించి త్వరితముగా కౌలస కోట చేరతాడు. సైన్యములో మూడవ వంతు మాత్రమే మిగిలింది. మహమ్మద్ షా భుజానికి తీవ్ర గాయమయ్యింది. కౌలసలో సాయమునకొచ్చిన కొత్త సేన వలన బ్రతికిపోతాడు. గుల్బర్గా వరకు మిగిలిన ప్రయాణము శాంతముగా సాగిపోయింది[2].

ఐదవ పోరు[మార్చు]

వినాయకదేవుని మరణ వార్త విని కాపానీడు విచారముతో క్రుంగి పోతాడు. బహమనీ రాజ్యము కూల్చుటే ఆతని ధ్యేయము. విజయనగర తోడ్పాటుతో, క్రీ. శ. 1363లో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుఘ్లక్ బహమనీ రాజ్యముపై దండెత్తి వచ్చినచో తమ సాయముండునని వార్త పంపుతాడు. కాని తుఘ్లక్ పట్టించుకోడు. విషయము తెలిసి మహమ్మద్ షా ఉగ్రుడవుతాడు. పెద్ద సైన్యముతో కౌలస కోటకు వచ్చి, ఆజం హుమాయూన్ ను గోలకొండకు, సఫ్దర్ ఖాన్ ను ఓరుగల్లుకు పంపి బహాదూర్ ఖాను తోడుగా యుద్ధానికి తరలుతాడు. ఇదే సమయాన విజయనగరములో బుక్కరాయలు మరణిస్తాడు. క్షీణించిన సైన్యముతో కాపానీడు అడవులను ఆశ్రయిస్తాడు. మహమ్మద్ షా తెలంగాణమునంతయూ దోచుకున్నాడు. దేశము సర్వనాశనము గావించాడు. గత్యంతరము కానక కాపానీడు క్రీ. శ. 1364లో మరలా సంధి చేసుకుంటాడు. ఈ సంధి ప్రకారము 33 లక్షల రూపాయలు, 300 ఏనుగులు, 50 గుర్రములు, గోలకొండ కోట శాశ్వతముగా వదలుకుంటాడు. వజ్రవైఢూర్యములు పొదగబడిన బంగారు సింహాసనము (తఖ్త్-ఇ-ఫిరూజీ) షాకు సమర్పించుకుంటాడు. అటుపిమ్మట ఆతనికి బహమనీలతొ ఇబ్బంది కలుగలేదు.

చివరి పోరు

కాపానీడుకు బహమనీల బెడద తప్పిననూ రేచెర్ల వెలమల బాధ తప్పలేదు. మహమ్మద్ షాతో యుద్ధములందు మునిగి ఉన్న సమయములో రేచెర్ల సింగమ నాయకుడు స్వాతంత్ర్యము ప్రకటించి పిల్లలమర్రి, అనుమనగల్లు ప్రాంతము జయింప బూనగా కాపానీడు ఆతనిని అణచాడు. ఇదే విధముగా అద్దంకి వేమారెడ్డి పై సింగమ చేసిన దాడిలో వేమారెడ్డికి సాయపడ్డాడు. క్రీ. శ. 1361లో జల్లిపల్లి కోట ముట్టడిలో సింగమ నాయకుడు క్షత్రియుల చేతిలో హతుడయ్యాడు. పిమ్మట ఆతని కుమారులు అనవోతా నాయకుడు, మాదా నాయకుడు రాజ్యకాంక్షతో కాపానీడుపై దండెత్తుతారు. బహమనీల యుద్ధములవల్ల బలహీనపడి, ధనకోశము, సైన్యము సన్నగిల్లి, పుత్రుని కోల్పోయి, విషణ్ణుడైన కాపానీడు తోటి తెలుగు వారితో యుద్ధము చేయక తప్పలేదు. ఓరుగల్లు సమీపములో భీమవరము వద్ద జరిగిన మహాసంగ్రామములో తెలుగు దేశమును పారతంత్ర్యమునుండి విడిపించిన మహా యోధుడు ముసునూరి కాపయ నాయకుడు క్రీ. శ. 1368లో హతుడయ్యాడు.

ప్రాముఖ్యత

మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి మాటలలో: "ముసునూరి వారు పూర్తిగా అర్ధ శతాబ్దమైనను తెలుగు దేశమును పరిపాలింపలేదు. ఈ వంశములో పరిపాలనము నెరపిన వారు ప్రోలయ నాయక, కాపయ నాయకులు తెలుగుదేశచరిత్రలో వారు వహించిన పాత్ర అనుపమానమైనది. వింధ్యకు దక్షిణమందుండిన గొప్ప హిందూ రాజ్యములన్నియూ ఢిల్లీ సుల్తాను మహమ్మదు బిన్ తుగ్లకుకు పాదాక్రాంతములై ఆ చక్రవర్తి మగటిమిని, సామ్రాజ్యబలమును తలయెత్తి ఎదిరింపలేని కాలమున, పూర్వపు సూర్యవంశ, చంద్రవంశజులైన క్షత్రియుల రాజ్యములన్నియు క్రుంగి కూలారిపోయిన కాలమున అంతటి మహాబలవంతుడైన ఢిల్లీ చక్రవర్తిపై కత్తికట్టి అతని యధికారమును ధిక్కరించి స్స్వాతంత్ర్యోద్యమమును లేవదీసి దానిని విజయవంతముగా నడిపిన కీర్తిప్రతిష్ఠలు తెలుగు ప్రజానీకమువి; తెలుగు నాయకులవి; అందును ముఖ్యముగా ముసునూరి ప్రోలయ, కాపయనాయకులవి. వీరు హిందూరాజ్య పునరుద్ధరణమునకు దీక్షాకంకణములు కట్టి యవనవారధి నిమగ్నమైన తెలుగుభూమిని ఉద్ధరించినపిదపనే దక్షిణదేశమున నుండిన ఇతర రాజ్యములకు ధైర్యము కలిగి ఢిల్లీ సుల్తానుపై తిరుగుబాటులు కావించి విజయలక్ష్మీసంపన్నములైనవి. హిందూదెశచరిత్రలో తెలుగు నాయకుని అధిపత్యమున తమకు తామై ప్రజలే తమ శ్రేయోభాగ్యములకొరకు అపూర్వ ధైర్యోత్సాహములతో విమత బలములను ఎదిరించి పోరాడి స్వరాజ్యమును స్థాపించుకొనిన అపూర్వ, అద్భుత ప్రకరణమిది; ప్రాచీనచరిత్రలో అశ్రుతపూర్వమైనది. ముసునూరినాయకులకు విజయమే లభించి యుండకపొయినచో మన తెలుగుదేశ చరిత్ర మరియొకతెన్నున నడచియుండెడిది. అందువలన ముసునూరి నాయకుల పరిపాలనాకాలము కొద్దిదైనను అది మహాసంఘటనాకలితమైనది. ముసునూరివారి స్వాతంత్ర్యవిజయముతో తెలుగుదేశములో నూతన యుగము ఆరంభమైనది. తెలుగుదేశచరిత్ర ఉత్తరమధ్యయుగములో పడినది".[3]

మూలాలు

  1. పైకి దూకు
     విలస తామ్ర శాసనము: Venkataramanayya, N. and Somasekhara Sarma, M. 1987, Vilasa Grant of Prolaya Nayaka, Epigraphica Indica, 32: 239-268
  2. పైకి దూకు
     మహమ్మద్ కాసిం ఫెరిష్తా, Translation by John Briggs, History of the Rise of Mahomedan Power in India, Vol. 2, 1829, pp. 310-319, Longman and others, London
  3. పైకి దూకు
     ముసునూరి వంశీయులు; విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, తెలుగు సంస్కృతి (దేశము-చరిత్ర), తెలుగు విశ్వవిద్యాలయము,  హైదరాబాదు, 1990; పుటలు 348-362
'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' ముసునూరు కాపయ నాయకుడు










"ముసునూరి నాయకులు, కమ్మ దుర్జయ వంశము" - 

ముసునూరు కమ్మ నాయకుల చరిత్ర


"ముసునూరి వారి (ముసునూరి కమ్మ నాయకులు, దుర్జయ వంశము) వంశ చరిత్ర", "ఆంధ్ర (త్రిలింగ దేశ) స్వాతంత్య్రోద్యమము"....................................

"ముసునూరి వారి వంశ చరిత్ర" కు ప్రోలయనాయకుడి విలసతామ్ర శాసనం, కాపయ నాయకుడు వేయించిన పోలవరం శాసనాలు ముఖ్య ఆధారాలు. చోడభక్తిరాజు వేయించిన పెంటపాడు శాసనం, రెడ్డిరాణి అనితల్లి వేయించిన కలువచేరు శాసనాలు కూడా ప్రోలయ, కాపయలను ప్రస్తావిస్తున్నాయి."ముసునూరు" అనే గ్రామం "కృష్ణా జిల్లా"లో ఉంది. ఉయ్యూరు సమీపంలోని ముసునూరులో "కోటగోడ"ల శిథిలాలు ఈనాటికీ కనిపిస్తాయి. అందువల్ల ముసునూరే వీరి జన్మస్థానం కావొచ్చని చరిత్రకారుల అభిప్రాయం. వీరు "కమ్మ కులస్థులు, దుర్జయ వంశము". వీరి వంశకర్త "పోతననాయకుడు". అతడికి పోచ, దేవ, కామ, రాజనాయకులనే పినతండ్రులున్నారు. "వేంగీ మండలానికి" నాయకుడైన పోచ నాయకుడి కుమారుడు ప్రోలయనాయకుడు. ఇతడు అతి పరాక్రమశాలి. గోదావరి తీరంలోని మన్య ప్రాంతమైన (భద్రాచల ప్రాంతమన్య భూములు) "రేకపల్లి దుర్గం" నుంచి తన పోరాటాలను కొనసాగించాడు.......ప్రోలయ నాయకుడు ముస్లింల దాడుల్లో నష్టపోయిన అగ్రహారాలతోపాటు, వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాడు..........

ఢిల్లీ సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు జునాఖాన్-ఉలుగ్ ఖాన్(మహ్మద్ బిన్ తుగ్లక్) క్రీ.శ.1323లో ఓరుగల్లును ముట్టడించి, "కాకతీయ ప్రతాపరుద్రుడిని" బందీగా పట్టుకున్నాడు. కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానత్‌లో విలీనం చేశాడు. దీంతో ఆంధ్రదేశం తొలిసారిగా మహ్మదీయుల పాలనలోకి వెళ్లింది. మహ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లు పేరును సుల్తాన్‌పూర్‌గా మార్చినట్లు చరిత్రకారులు ఇలియట్, డాసన్ రచనల ద్వారా తెలుస్తోంది........

తనను బందీగా తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో నర్మదానదీ తీరంలో ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన విలసతామ్ర శాసనం, క్రీ.శ.1425లో రెడ్డిరాణి అనితల్లి వేయించిన కలువచేరు శాసనాలు పేర్కొంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని కందరాడ గ్రామంలో లభించిన ముసునూరి ప్రోలయనాయకుడి విలసతామ్ర శాసనం ప్రధానంగా ఆనాడు ఆంధ్రదేశంలో మహ్మదీయుల దాడులను విశదంగా వర్ణించింది.
ఆంధ్రదేశంతోపాటు హోయసాల, బల్లాల రాజ్యం, కంపిలి రాజ్యాలు తుగ్లక్‌ల ఆధీనంలోకి వచ్చాయి. ఆంధ్రదేశంలో మహ్మదీయ సైనిక పాలన సుస్థిరమైంది. పాలకులు రైతుల నుంచి అధిక పన్నులను నిర్దాక్షిణ్యంగా వసూలు చేయడం వల్ల రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఏలూరు సమీపంలో ఘియాసుద్దీన్ నాణేలు దొరికాయి. దీన్నిబట్టి క్రీ.శ.1324 నాటికి తీరాంధ్ర ప్రాంతం ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రదేశాన్ని ముస్లింల పాలన నుంచి విముక్తి చేసేందుకు "ముసునూరి నాయకులు" కృషి చేశారు. త్రిలింగ దేశాన్ని రక్షించేందుకు జరిగిన పోరాటానికి ముసునూరి ప్రోలయ నాయకుడు, అతడి తమ్ముడి కుమారుడైన ముసునూరి కాపయ నాయకుడు నాయకత్వం వహించారు.....కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసిన కొందరు నాయకులు కమ్మ దుర్జయ వంశము చెందిన ముసునూరు నాయకులు (Musunuri Nayakas) అని ప్రసిద్ధి చెందారు. కాకతీయుల తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో 'ముసునూరు కాపయ నాయకుడు' 'ముసునూరు ప్రోలయ నాయకుడు' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు...............................................................................................................................

పరిచయము
1323 సంవత్సరములో ఆంధ్ర దేశము అల్లకల్లోల పరిస్థితిలో ఉంది. ఢిల్లీ సుల్తాను పంపిన ఉలుఘ్ ఖాన్ (మహమ్మద్ బిన్ తుగ్లక్) మూడు నెలల ముట్టడి తరువాతప్రతాపరుద్రుని జయించి బంధించెను. ఓరుగల్లు నెలల తరబడి దోచబడెను. అమూల్యమైన కోహినూరు వజ్రముబంగారము, వజ్రవైఢూర్యములు మొదలగు సంపద 20,000 గుర్రములు, ఏనుగులు, ఒంటెలపై ఢిల్లీ తరలించబడెను. ప్రతాపరుద్ర మహారాజు, దుర్గపాలకుడు గన్నమ నాయుడు (యుగంధర్/మాలిక్ మక్బూల్) మొదలగు వారు బందీలుగా ఢిల్లీ తరలుచుండగా మహారాజు నర్మదా నదిలో ఆత్మహత్య గావించుకొనెను.

ముసునూరి   ప్రోలానీడు

ప్రోలయ నాయకుని విలస శాసనమందు ఆనాటి తెలుగు దేశపు దయనీయ దుస్థితి వర్ణించబడెను. అట్టి విషమ కాలమందు బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన నాయకులను ఐక్యపరచిరి. వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను ఒక కమ్మసేనానిని ఎన్నుకొనిరి. ప్రతాపరుద్రుని 72 నాయకులలో ప్రోలానీడు ఒకడు. కృష్ణా మండలములోని నూజివీడుకు చెందినవాడు. అతని తండ్రి పేరు పోచినాయకుడు. పోచినాయకునికి ముగ్గురు తమ్ములు గలరు. వారు రాజనాయకుదు, కమ్మనాయకుడు మరియు దేవనాయకుడు. దేవనాయకునికి మహావీరుడగు పుత్రుడు కాపయ నాయకుడు జన్మించెను. ముసునూరి కాపానీడు తన పినతండ్రికి చేదోడు వాదోడుగా నిలచి పేరుప్రఖ్యాతులు గడించెను.
ప్రోలానీడు నాయకులందరిని ఒక త్రాటిపై తెచ్చి ఓరుగల్లును విముక్తిగావించుటకు పలు వ్యూహములల్లెను. అతనికి ముఖ్య సహచరులుగా అద్దంకి వేమారెడ్డి, కొప్పుల ప్రోలయనాయకుడు, రేచెర్ల సింగమనాయకుడు, మంచికొండ గణపతినాయకుడు, వుండి వేంగభూపతి మొదలుగు మహావీరులు తెలుగు దేశమును పారతంత్ర్యము నుండి విడిపించుటకు సన్నద్ధులైరి. పలుచోట్ల పెక్కు యుద్ధముల పిదప 1326 లో తురుష్కులను దక్షిణభారతమునుండి తరిమివేయుటలో నాయకులు సఫలమైరి. హిందూమతము రక్షించబడెను. దేవాలయములు పునరుద్ధరించబడెను. కోటలు గట్టిబరచబడెను. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడెను.

'ఆంధ్రదేశాధీశ్వర'  'ఆంధ్రసురత్రాణ'  ముసునూరి  కాపానీడు

కాపానీడు
వయసు మీరిన ప్రోలానీడు రాజ్యాధికారమును కాపానీడికి అప్పగించి భద్రాచలం తాలుకకు తూర్పు దిషగా రెక్కపల్లి (రేఖపల్లి) కోటకు తరలిపోయెను. ముసునూరివారి విజయములచే ఉత్తేజితులై హొయసల, ద్వారసముద్రము మరియు అరవీటి రాజులు తిరుగుబాటు చేసి తిరిగి వారి వారి రాజ్యములు సాధించుకొనిరి. ఇస్లాము మతమునకు మార్చబడిన హరిహర మరియు బుక్క రాయలు హోయసల రాజ్యమును జయించి విద్యారణ్యులవారి బోధనలవల్ల తిరిగి హిందూ మతమును స్వీకరించి ఆనెగొందిలో విజయనగర రాజ్యము స్థాపించిరి. మధురలో జలాలుద్దీను హస్సను స్వతంత్రుడిగా ప్రకటించుకొనెను. సుల్తాను ఉగ్రుడై స్వయముగా పెద్దసైన్యముతో ఓరుగల్లు చేరెను. అచట ప్రబలుచున్న మహమ్మారివల్ల సుల్తానుకు అంటు జాడ్యము వచ్చింది. భయపడిన సుల్తాను తిరిగి దౌలతాబాదుకు తిరుగుముఖము బట్టెను. తనతో వచ్చిన ముల్తాను పాలకుడు మాలిక్ మక్బూల్ను ఓరుగల్లు కోటకు అధిపతిగా నియమించి ఢిల్లీకి తిరిగిపోయెను . వెనువెంటనే హోయసల రాజు సహకారముతొ కాపయ ఓరుగల్లుపై దాడి చేసి తెలంగాణమంతయును విముక్తి గావించెను. మాలిక్ మక్బూల్ ఢిల్లీకి పారిపోయెను. ఓరుగల్లు కోటపై ఆంధ్రదేశ పతాకము ఎగిరెను. కాపానీడు 'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' అను బిరుదులు పొందెను. ప్రజారంజకముగా పరిపాలించెను. తన తోటినాయకులగు వేమారెడ్డి, పిఠాపురం కొప్పుల నాయకుడు, రేచెర్ల, భువనగిరి, దేవరకొండ పద్మనాయకుల స్వతంత్రమును గౌరవించెను. కాపానీడు సామ్రాజ్యము శ్రీకాకుళం నుండి బీదరు వరకు సిరిపూరు నుండి కంచి వరకు విస్తరించెను. అది ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము.

పతనము

1345లో హసను గంగు మహమ్మదు బీన్ తుగ్లకుపై తిరుగుబాటు చేసి దేవగిరిలో బహమనీ రాజ్యము స్థాపించెను. 1347లో తన రాజధానిని గుల్బర్గాకు మార్చెను. అతని ముఖ్యోద్దేశము దక్షిణాపథమునంతయు ఆక్రమించుట. క్రమముగా తెలుగు నాయకులలో ఐక్యత సన్నగిల్లసాగెను. పాత అసూయలు, కక్షలు తిరిగి తలెత్తాయి. రేచెర్ల సింగమ నాయుడు అద్దంకిపై దండెత్తగా కాపయ కలుగచేసుకొనెను, సింగయకది నచ్చలేదు. అదేసమయాన తుగ్లక్ బహమనీ రాజ్యముపై దాడిచేయగా కాపయ సాయమందించెను. బహమనీ సుల్తాను ఎంత క్రుతఘ్నుడో కాపానీడికి త్వరలో తెలియవచ్చెను. 1350లో సింగమ నాయుని ప్రోద్బలముతోఅలావుద్దీను ఓరుగల్లుపై మొదటిసారి దండెత్తెను. ఇది ఊహించని కాపానీడు వీరోచితముగా పోరాడినను తప్పక సంధిగావించుకొని కైలాసకోటనుఅలావుద్దీనుకప్పగించెను. తుగ్లక్ 1351లో మరణించగా మిగుల ఉత్సాహముతో అలావుద్దీను పెద్దసైన్యము సమకూర్చుకొని 1355లో మరలా ఓరుగల్లుపై దండెత్తెను. ఆతనికి సింగమ నాయుడు లోపాయకారీగా సహాయపడెను. భువనగిరి సహా పెక్కు కోటలు స్వాధీనపర్చుకొని ఒక సంవత్సరముబాటు అలావుద్దీను తెలంగాణలో సర్వనాశనముగావించెను. 1359లో గుల్బర్గకు తిరిగిపోయి మరణించెను. పిమ్మట మహమ్మదు షా గుల్బర్గలో రాజయ్యాడు. అది అదనుగా కాపానీడు తన కుమారుడు వినాయకదేవుని భువనగిరి మరియు కైలాసకోటలను విముక్తి గావించుటకు పంపెను. ఆతనికి బుక్క రాయలు సాయపడెను. తొలుత విజయములు సాధించినను వినాయక దేవుడు షా సైన్యమునకు చిక్కి మహాఘాతుకముగా వధించబడ్డాడు. కాపానీడికి అదొక పెద్ద విషాదఘాతము. బుక్కరాయల సహాయముతొ కాపానీడు బహ్మనీ సుల్తానుపై పెద్ద దాడికి సన్నిద్ధుడయ్యెను. అది తెలిసి మహమ్మదు షా కోపోద్రిక్తుడై తెలంగాణపై దండెత్తెను. రాచకొండ నాయకులు అతనికి సాయమందించారని చరిత్రకారుల అభిప్రాయము. అలాంటి విషమసమయమున బుక్కరాయలు మరణించెను. విజయనగర తోడ్పాటు లేకపోయెను. కాపానీడు ఓడిపొయి గొల్లకొండ కోటను, నెమలి సింహాసనము, ఎనలేని సంపద, వజ్రవైఢూర్యములు, బంగారము సమర్పించుకొనెను. మహమ్మదు షా రెండు వర్షములు తెలంగాణను అన్నివిధములుగా నాశనము గావించి 1365లో తిరిగిపోయెను. అదే అదనుగా రేచెర్ల సింగమ నాయుడు అతని కుమారులు స్వాతంత్ర్యము ప్రకటించుకొని బలహీనపడిన కాపానీడుపై యుద్ధము ప్రకటించిరి. ఖాళీ ఐన కోశాగారముతో, యుద్ధములలో అలసిన సైన్యముతో, విషణ్ణుడైన కాపానీడు పోరుకు తలపడెను. భీమవరము వద్ద జరిగిన పోరులో తెలుగుదేశపు ఐక్యతకు, హిందూమత రక్షణకు, దక్షిణభారతమును పరదాస్యమునుండి విముక్తి చేయుటకు ఎన్నోత్యాగములుచేసిన మహామానధనుడు 1370లో అసువులు బాసెను.

ప్రాముఖ్యత

సోమశేఖర శర్మ మాటలలో: "తెలుగుదేశచరిత్రలో వారు వహించిన పాత్ర అనుపమానమైనది. వింధ్యకు దక్షిణమందుండిన గొప్ప హిందూ రాజ్యములన్నియూ ఢిల్లీ సుల్తాను మహమ్మదు బిన్ తుగ్లకు కు పాదాక్రాంతములై ఆ చక్రవర్తి మగటిమిని, సామ్రాజ్యబలమును తలయెత్తి ఎదిరింపలేని కాలమున, పూర్వపు సూర్యవంశ, చంద్రవంశజులైన క్షత్రియుల రాజ్యములన్నియు క్రుంగి కూలారిపోయిన కాలమున అంతటి మహాబలవంతుడైన ఢిల్లీ చక్రవర్తిపై కత్తికట్టి, అతని యధికారమును ధిక్కరించి, స్స్వాతంత్ర్యోద్యమమును లేవదీసి, దానిని విజయవంతముగా నడిపిన కీర్తి, ప్రతిష్ఠలు తెలుగు ప్రజానీకమువి; తెలుగు నాయకులవి; అందును ముఖ్యముగా ముసునూరి ప్రోలయ, కాపయనాయకులవి. వీరు హిందూరాజ్య పునరుద్ధరణమునకు దీక్షాకంకణములు కట్టి యవనవారధి నిమగ్నమైన తెలుగుభూమిని ఉద్ధరించిన పిదపనే దక్షిణదేశమున నుండిన ఇతర రాజ్యములకు ధైర్యము కలిగి, ఢిల్లీ సుల్తానుపై తిరుగుబాటులు కావించి విజయలక్ష్మీ సంపన్నములైనవి. హిందూదేశచరిత్రలో తెలుగు నాయకుని అధిపత్యమున తమకు తామై ప్రజలే తమ శ్రేయోభాగ్యములకొరకు అపూర్వ ధైర్యోత్సాహములతో విమత బలములను ఎదిరించి పోరాడి స్వరాజ్యమును స్థాపించుకొనిన అపూర్వ, అద్భుత ప్రకరణమిది; ప్రాచీన చరిత్రలో అశ్రుతపూర్వమైనది. ముసునూరినాయకులకు విజయమే లభించి యుండకపోయినచో మన తెలుగుదేశ చరిత్ర మరియొకతెన్నున నడచియుండెడిది. అందువలన ముసునూరి నాయకుల పరిపాలనాకాలము కొద్దిదైనను, అది మహాసంఘటనాకలితమైనది. ముసునూరివారి స్వాతంత్ర్యవిజయముతో తెలుగుదేశములో నూతన యుగము ఆరంభమైనది. తెలుగుదేశచరిత్ర ఉత్తరమధ్యయుగములో పడినది".
"ముసునూరు" అనే గ్రామం "కృష్ణా జిల్లా" ఉయ్యూరు తాలూకాలో ఉంది. ఇప్పటికీ ఈ గ్రామంలో కోట శిథిలాలు ఉన్నాయి. దీనినిబట్టి వీరి జన్మస్థలం ఇదే కావచ్చు! వీరు "కమ్మ కులస్థులు, దుర్జయ వంశము ". కాకతీయ పతనానంతరం ముస్లింల వశమైన తెలంగాణ ప్రాంతంలో చెలరేగిన అసంతృప్తిని అవకాశంగా తీసుకొని ఈ వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు భద్రాచలం ప్రాంతంలోని రేఖపల్లిని రాజధానిగా చేసుకొని ముస్లింలతో పోరాడాడు. ఈ పోరాటంలో ప్రోలయ నాయకునికి పినతండ్రి కుమారుడు కాపయనాయకుడు, వేంగి పాలకుడు వేంగ భూపాలుడు, మొదలైన వారు సహాయం చేశారు. ఇలా రేఖపల్లిలో స్వతంత్ర రాజ్య స్థాపన చేశాడు. ఇతని మంత్రి కుమారునికి అన్నయ్య మంత్రి విలాసా గ్రామం దానం చేస్తూ తామ్ర శాసనం వేయించాడు. అన్నయ్యమంత్రికి "ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసన ప్రతిష్టాపనా చార్య" అనే బిరుదు ఉంది. -ప్రోలయ నాయకునికి సంతానం లేనందువల్ల ఇతని మరణం తర్వాత కాపయ నాయకుడు రాజయ్యడు. 75 మంది నాయకుల సహాయంతో (సింగమనేడు, వేమారెడ్డి మొదలైనవారు......) ఓరుగల్లును ముట్టడించి ముస్లింలతో పోరాటం కొనసాగించి క్రీ.శ. 1336లో ఓరుగల్లును ఆక్రమించాడు. దీంతో మాలిక్ మక్బూల్ పారిపోయాడు. ఓరుగల్లు రాజధానిగా ఉత్తర తెలంగాణను కృష్ణా నది నుంచి గోదావరి వరకు గల ఉత్తర తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించాడు. విస్తరణ కాంక్షతో రేచెర్ల సింగమనేని రాజ్య భాగాలైన పిల్లలమర్రి, ఆమనగల్లు, వాడపల్లి ప్రాంతాలను ఆక్రమించి ఎరబోతు లెంకను నియమించాడు. తీరాంధ్ర ప్రాంతంలో తన ప్రతినిధులను నియమించాడు. i. కోరుకొండ్ల ప్రాంతంలో కూననాయకుడిని నియమించాడు. ii. సబ్బినాడు (కరీంనగర్) ముప్పు భూపాలుడిని నియమించాడు. -కాపయనాయకునికి ఆంధ్ర సురత్రణ ఆంధ్ర దేశాధీశ్వర అనే బిరుదులు ఉన్నాయి. -అదే సమయంలో అల్లా ఉద్దిన్ హసన్ గంగూ బహ్మనీ షా బిరుదు లేదా జాఫర్‌ఖాన్ పేరుతో 1347లో గుల్బర్గాలో బహ్మనీ రాజ్య స్థాపనలో కాపయనాయకుడు సహాయం చేశాడు. సహాయం మర్చి విశ్వాసఘాతానికి పాల్పడ్డ హసన్ గంగూ చివరికి 1350లో ఓరుగల్లుపై దాడి చేశాడు. -ఈ దాడిలో కాపయనాయకుడు కౌలాస్ (నిజామాబాద్) దుర్గాన్ని వదులుకున్నాడు. 1356 లో మరోసారి హసన్ గంగూ దాడి చేసి భువనగిరి దుర్గాన్ని ఆక్రమించుకున్నాడు. బహ్మనీలకు భువనగిరి తూర్పు సరిహద్దు అయ్యింది. కాపయనాకుడు హసన్‌గంగూ దాడులను అరికట్టాలని విజయనగర రాజు బుక్కరాయల సాయం కోరాడు. అయినప్పటికీ తన కుమారుడు వినాయక దేవుణ్ణి యుద్ధంలో కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మల్లీ హసన్‌గంగూ రెండు సేనల నాయకత్వాన హుమాయున్ సేనానిగా గోల్కొండపైకి, సప్దర్ ఖాన్ నాయకత్వాన ఓరుగల్లు పైకి దండయాత్రలకు పంపించాడు. కాపయనాయకుడు అన్నీ కోల్పోయి చివరికి బహ్మనీ సుల్తాన్‌తో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం.... -1. గోల్కొండ -2. ఓరుగల్లు దుర్గాలను సమర్పించాడు. -3. 300 ఏనుగులు, 2000 గుర్రాలు, 3 లక్షల రూపాయలు యుద్ధ పరిహారంగా చెల్లించాడు. -ఈ వరుస పరాజయాలను ఆసరాగా తీసుకుని తీరాంధ్ర రాజులు స్వతంత్రించారు. ఉత్తర తీరాంధ్ర రెడ్డిరాజుల ఆధీనంలోకి వెళ్లింది. తీరాంధ్ర చేజారిపోయే సమయంలో దక్షిణ తెలంగాణలో ఆమనగల్లు, పిల్లలమర్రి ప్రాంతాలను పాలిస్తున్న రేచెర్ల సింగమనాయుడు విజృంభించి కృష్ణానది వరకు తన రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా, కృష్ణా, తుంగ భద్ర అంతర్వేది ప్రాంతాలను కూడా ఆక్రమించాడు. -సింగమనాయకుని తర్వాత రాజైన అనపోతనాయుడు తన తండ్రి మరణానికి కారకుడైన కాపయ నాయకునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓరుగ్లు మీద దండయాత్ర చేసి 1366లో కాపయ నాయకుని చంపి భువనగిరి, ఓరుగల్లు మొదలైన దుర్గాలను స్వాధీనం చేసున్నాడు. దీంతో "ముసునూరి వంశం" అంతరించింది. దాదాపు 50 ఏండ్లు ఉత్తర తెలంగాణ ప్రాంతాలుముసునూరి పాలనలో ఉన్నాయి.
ముసునూరు ప్రోలయ నాయకుడు

 'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' ముసునూరు కాపయ నాయకుడు



మూలాలు

  1. పైకి దూకు ఆచార్య బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన బౌద్ధము-ఆంధ్రము 
  2. పైకి దూకు Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair
  3. పైకి దూకు Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London
  4. పైకి దూకు A Social History of the Deccan: 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, pp. 15-26, ISBN 0521254841
  5. పైకి దూకు India Before Europe, C. E. B. Asher and C. Talbot, 2006, Cambridge University Press, p.40, ISBN 0521809045
  6. పైకి దూకు Sastry, P.V. Parabrahma, The Kakatiyas, 1978
  7. పైకి దూకు ప్రోలానీడు విలస శాసనము: Epigraphica Indica 32: 239-268
  8. పైకి దూకు తెలుగు విజ్ఞాన సర్వస్వము, చరిత్ర, సంపుటము 2, తెలుగు విశ్వవిద్యాలయము, 1990, హైదరాబాదు
  9. పైకి దూకు Durga Prasad, History of the Andhras up to 1565 A. D., 1988 , P. G. Publishers, Guntur
  10. పైకి దూకు After the Kakatiyas, V. Yashoda Devi, 1975, Andhra Pradesh Sahitya Academy, Hyderabad
  11. పైకి దూకు A history of South India from prehistoric times to the fall of Vijayanagar, K. A. Nilakanta Sastri, 1955, Oxford Univ. Press
  12. పైకి దూకు Pre-colonial India in Practice, Cynthia Talbot, 2001, Oxford University Press, pp.177-182, ISBN 0195136616
  13. పైకి దూకు Administration and Society in Medieval Andhra (A.D. 1038-1538), C. V. Ramachandra Rao, 1976, Manasa Publications, Hyderabad, p.36




Wednesday 4 January 2017

""సాగి గన్నమ నాయుడు (మాలిక్ మక్బూల్), కమ్మ దుర్జయ వంశము,విప్పర్ల గోత్రము"".....................యుక్తికి యుగంధరుడు,రాజనీతి విశారదుడు, ఖానే జహాన్ మాలిక్ మక్బూల్ తెలంగాణి, కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానం మంత్రి. ‘జలమర్త్యండ’ , కాకతీయుల మంత్రి నాగయ్యగన్న........

మహాధికారి పదవితో పాటు సేనానిగా ప్రతాపరుద్ర చక్రవర్తికి ఆప్తుడై పొగడ్తలు అందుకున్నవాడుగా మారన నాగయగన్నను పొగి డా డు. అంతేకాకుండా ‘జలమర్త్యండ’ బిరుదాంకితుడై సేనా నాయకుని గా, మహాధికారిగా నాగయగన్న మంత్రి ప్రతాపరుద్ర చక్రవర్తికి అత్యం త ఆప్తుడుగా తెలిపాడు.
‘జలమర్త్యండ ప్రతాపరుద్ర
మనజువిభునకు సేనానియును మహాధికారియును
నాప్తుడునునై పొగడ్తకెక్కె’6
ఇతడు క్రీ.శ.14వ శతాబ్ది మధ్య భాగంలో కరీంనగర్ జిల్లాలోని రామగిరి నేలిన ముప్ప భూపాలుని మంత్రిగా ఉన్న కందన తాతకు అ న్న. నాగయగన్న తమ్ముళ్ళు మేచయ, ఎల్లయ నాయకులలో ఎవరో ఒ కరు కందన మంత్రి తాత. మడికి సింగన రాసిన ‘పద్మపురాణోత్తర ఖండ’ పుస్తకాన్ని కందన మంత్రికి అంకితమిచ్చాడు. నాగయగన్న వంశీయులు "కమ్మ కులస్తులు". వారిని, చతుర్థ కులస్తులని పిలుస్తారు.

ఢిల్లీలో జీర్ణావస్థలో ఉన్న మాలిక్ మక్బూల్ సమాధి.

సాగి గన్నమ నాయుడు / యుగంధర్/ మాలిక్ మక్బూల్ -  కమ్మ దుర్జయ వంశము, గోత్రము విప్పర్ల:-
 కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రునిసేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు. మారన రచించిన మార్కండేయ పురాణం గ్రంథాన్ని అంకితమొందినాడు.
గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు గణపతి దేవుని కడ మరియు రుద్రమదేవి కడ సేనాధిపతిగా ఉన్నాడు. దాది వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి.కొత్త భావయ్య పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల.
గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణమును గన్నయకు అంకితమిచ్చాడు. ఈతనికి ఫిరోజ్ షా తుగ్లక్ (1351–1388) 'ఖాన్-ఎ-జహాన్ తిలంగాణీ' అను గొప్ప బిరుదును ఇచ్చాడు.
1323వ సంవత్సరములో ముస్లిముల ధాటికి ఓరుగల్లు తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు మరియు పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కారు. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ చేరిన పిదప గన్నమ నాయునికి మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చింది. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. మరియు తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుటఢిల్లీ సుల్తానుల రివాజు. గన్నమ మాలిక్ మక్బూల్ గా మార్చబడ్డాడు. సుల్తాను మక్బూల్ ను పంజాబ్ పాలకునిగా ముల్తాను పంపాడు.
ఉలుఘ్ ఖాను (మహమ్మద్ బిన్ తుగ్లక్) ఓరుగల్లును 1323లో దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచాడు. అటుపిమ్మట ముసునూరి నాయకుల విప్లవముతో తెలుగునాడు విముక్తమైంది. 1335లో మధుర సుల్తాను జలాలుద్దీను కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. ఇది సహించని తుగ్లకు పెద్దసైన్యముతో మక్బూల్ ను తొడ్కొని ఓరుగల్లు చేరాడు. అచట ప్రబలుతున్న మహమ్మారి వల్ల సుల్తానుకు అంటుజాడ్యము సోకింది. భయపడిన సుల్తాను తూర్పు తెలంగాణమును మక్బూల్ ను అధిపతిగా చేసి ఢిల్లీ తిరిగి వెళ్ళాడు. 1336లో కాపానీడు మక్బూల్ ను ఓరుగంటినుండి తరిమివేసి కోటను జయించాడు.
అటు పిమ్మట మక్బూల్ తిరిగి ఢిల్లీ దర్బారు చేరి గుజరాత్ మరియు సింధు దేశములలో పెక్కు విజయములు సాధించాడు. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారులో వజీరు (ప్రధాన మంత్రి) గా నియమించబడ్డాడు. భాషాప్రాంతమతభేధములను అధిగమించి ఢిల్లీ దర్బారులో క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.
ఫిరోజ్ షా సింధుదేశపు దండయాత్ర సందర్భమున 6 నెలలు ఎట్టి వార్తలు లేవు. విషమపరిస్థితులలో ఢిల్లీని పలువురి కుతంత్రములనుండి కాపాడి సుల్తానుకు మక్బూల్ మరింత విశ్వాసపాత్రుడయ్యాడు. సంతసించిన సుల్తాను మక్బూలే నిజమైన సుల్తాను అని పొగిడాడు. ఒక సందర్భమున తురుష్క కోశాధికారి ఐన్ ఇ మహ్రుతో విభేదములు వచ్చి అతనిని తొలగించుటకు మక్బూల్ పట్టుబట్టగా సుల్తానుకు అలా చేయక తప్పలేదు. అప్పటినుండి మక్బూలే కోశాధికారిగా వ్యవహరించాడు. ఈతని జెనానాలో 2,000 మంది ఉంపుడుగత్తెలున్నారు.
మక్బూల్ 1372లో చనిపోయాడు. ఈతని సమాధి భారతదేశములోని మొదటి అష్ఠకోణపు కట్టడము. ఇది ఢిల్లీలో హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా దర్గా సమీపములో ఉంది.[1].ఆక్రమణలవల్ల, నిర్లక్ష్యమువల్లను సమాధి శిథిలావస్థలో ఉన్నది[2].

మక్బూల్ ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.

వారసుడు

1369 లో మక్బూల్ మరణం తరువాత, అతని కుమారుడు జౌనా ఖాన్ లేదా జౌనా షా వజీరు అయ్యాడు. ఇతడు తండ్రి వలె సమర్ధుడే కాని మంచి సైనిక నాయకుడు కాడు. ఫిరోజ్ షా సమయములోనే మొదలైన వజీరు పదవి కోసం పోరు జౌనా షాని బలి తీసుకున్నది. జౌనా ఖాన్ బంధించి మరణశిక్ష అమలు చేశారు. అతను బాగా పేరొందిన ఖిడికీమసీదు మొదలగు ఏడు పెద్ద మసీదులు కట్టించాడు.

వనరులు

  • Sri Marana Markandeya Puranamu, ed. G. V. Subrahmanyam, 1984, Andhra Pradesh Sahitya Academy, Hyderabad
  • శ్రీ మారన మార్కండేయపురాణము 
  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య చౌదరి, 1939, కొత్త ఎడిషను (2006), పావులూరి పబ్లిషర్సు, గుంటూరు,
  • A Forgotten Chapter of Andhra History by M. Somasekhara Sarma, 1945, Andhra University, Waltair
  • Sultan Firoz Shah Tughlaq by M. Ahmed, 1978, Chugh Publications, New Delhi p. 46 and 95
  • A History of India, H. Kulke and D. Rothermund, 1998, Routledge, p. 167, ISBN 0415154820
  • The Delhi Sultanate: A Political and Military History, P. Jackson, 1999, Cambridge University Press, p. 186, ISBN 0521543290
  • Medieval India; From Sultanat to the Mughals, S. Chandra, 2007, Har Anand Publications, p. 161, ISBN 8124110646.
  • A History of Telugu Literature, S. Krishnamurthy, S. Hikosaka and G. J. Samuel, 1994, Institute of Asian Studies, Madras, p. 175.
  • Bunce, Fredrick W. 2004. Islamic Tombs in India: The Iconography and Genesis of Their Design. New Delhi: D.K. Printworld, 52-55
  • Sharma, Y.D. 2001. Delhi and its Neighbourhood. New Delhi: Director General, Archaeological Survey of India, 27, 118

మూలాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  1. పైకి దూకు Tomb of Telanga Nawab: Anon (1997) Delhi, The Capital of India; Asian Educational Services. pp. 85. ISBN 81-206-1282-5, 9788120612822
  2. పైకి దూకు http://thespeakingarch.com/tomb_of_tilangani/
  3. పైకి దూకు ఖిడికీమసీదు: 
  4. http://deccanland.com/
  1. పైకి దూకు ఖిడికీమసీదు: