Monday 2 January 2017

"కాకతీయులు దుర్జయ వంశస్థులు - కాకతీయులు కమ్మవారు".............................


కాకతీయులు-దుర్జయ వంశస్థులు..........శాసనాధారాలను బట్టి "బయ్యారం శాశనం" ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.

"గూడూరు శాసనం"లో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.

"చేబ్రోలు శాశనం" ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.

దుర్జయ వంశస్థులు :-

1) "బయ్యారం శాశనం" ప్రకారం ఇతను కాకతీయ దుర్జయ వంశమునకు మూలపురుషుడు. ఇతను కాకతిపురం అను ప్రాంతం నుండి పరిపాలన సాగించినాడు.

2) "జాయప నాయుడు" - కమ్మ దుర్జయ వంశము:-జాయప నాయుడు లేక జాయప సేనాని సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని వద్ద పనిచేసిన సేనాధిపతి. 1241 లో వెలనాటి చోడులపై గణపతి విజయము సాధించిన తర్వాత వెలనాడు, కమ్మనాడు లోని వీరులందరు ఓరుగల్లు కు తరలిపోయారు. అట్టివారిలో జాయప ఒకడు. గణపతి దేవుడు ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను క్షత్రియుడైన గణపతిదేవుడు పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము కమ్మ నాయకులకు జాయప ఆద్యుడు. జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను దివిసీమను పాలించాడు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యములోవున్నారు.కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద చేబ్రోలు లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు. జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను సంస్కృత గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప నాట్యములో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.

3) "మాలిక్ మక్బూల్ లేక సాగి గన్నమ నాయుడు / యుగంధర్" - కమ్మ దుర్జయ వంశము, కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు.గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు గణపతి దేవుని కడ మరియు రుద్రమదేవి కడ సేనాధిపతిగా ఉన్నాడు.సాగి వారిది దుర్జయ వంశము-విప్పర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. కొత్త భావయ్య చౌదరి పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల.గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణమును గన్నయకు అంకితమిచ్చాడు.గన్నమ నాయుడు ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.

4) "ముసునూరి నాయకులు" - కమ్మ దుర్జయ వంశము
కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసిన కొందరు నాయకులు "కమ్మ దుర్జయ వంశము" చెందిన ముసునూరు నాయకులు (Musunuri Nayakas) అని ప్రసిద్ధి చెందారు. కాకతీయుల తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో 'ముసునూరు కాపయ నాయకుడు' 'ముసునూరు ప్రోలయ నాయకుడు' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు.ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. అట్టి విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1326 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో నాయకులు సఫలమయ్యారు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.ఓరుగల్లు కోటపై ఆంధ్రదేశ పతాకము ఎగిరెను. కాపానీడు ""'ఆంధ్రదేశాధీశ్వర'"" మరియు '""ఆంధ్రసురత్రాణ""' అను బిరుదులు పొందెను. ప్రజారంజకముగా పరిపాలించెను. తన తోటినాయకులగు వేమారెడ్డి, పిఠాపురం కొప్పుల నాయకుడు, రేచెర్ల, భువనగిరి, దేవరకొండ పద్మనాయకుల స్వతంత్రమును గౌరవించెను. కాపానీడు సామ్రాజ్యము శ్రీకాకుళం నుండి బీదరు వరకు సిరిపూరు నుండి కంచి వరకు విస్తరించెను. అది ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము.1370 వ సంవత్సరము దక్షిణభారత చరిత్రలో పెద్దమలుపు. తెలంగాణను జయించిన బహమనీ సుల్తాను విజయనగరము పై కన్ను వేసెను. ముసునూరి వారి త్యాగములు, దేశాభిమానము విజయనగర రాజులకు మార్గదర్శకమయ్యెను. ఓరుగల్లు పతనము పిమ్మట పెక్కు నాయకులు విజయనగరమునకు తరలి పోయి రాబోవు మూడు శతాబ్దములు దక్షిణభారతమును హిందూమతమును రక్షించుటకు పలుత్యాగములు చేసిరి. ఆంధ్రచరిత్రలో ముసునూరివారి పాలనము 50 వర్షములు మాత్రమేఐనను అది వారి త్యాగనిరతికి, తెలుగువారి ఐక్యతకు కాణాచి. సమకాలీన చరిత్రకు అది ఒక గుణపాఠము కూడ.

5) క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు.......
###"""""ప్రధాన కమ్మ రాజ వంశాలు - రాజ్యాలపరంపర కమ్మనాయకరాజులు"""""####.....................................

1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము
2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు)
3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి,ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు)
4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు)
5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు)
6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు)
7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు)
8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు)
9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు)
10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

కాకతీయుల వంశవృక్షము

తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు. వీరి కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి. కాకతీయ సామ్రాజ్యము 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో పతనమయ్యింది.

వంశావళి

1. కాకతి వెన్నయ (క్రీ. శ. 750 - 768)
2. [[మొదటి గుం 3. రెండవ గుండయ (క్రీ. శ. 825 - 870)
4. మూడవ గుండయ (క్రీ. శ. 870 - 895)
5. ఎఱ్ఱయ (క్రీ. శ. 896 - 925)
6. మొదటి బేతరాజు (క్రీ. శ. 946 - 955)
7. నాల్గవ గుండయ (క్రీ. శ. 956 - 995)
8. గరుడ బేతరాజు (క్రీ. శ. 996 - 1051)
9. మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052 - 1076)
10. రెండవ బేతరాజు (క్రీ.శ. 1076 - 1108)
11. దుర్గరాజు (క్రీ. శ. 1108 - 1116)
12. రెండవ ప్రోలరాజు (క్రీ. శ. 1116 -1157)
13. రుద్రదేవుడు (క్రీ.శ. 1158 - 1196)
14. మహాదేవుడు (క్రీ.శ. 1196 - 1199)
15. గణపతిదేవుడు (క్రీ.శ. 1199 - 1269)
16. రుద్రమదేవి (క్రీ.శ. 1269 - 1289)
17. ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 - 1323)
18. ముసునూరి నాయకులు (క్రీ.శ.1323 - 1370)

                         గణపతిదేవుడు

 రుద్రమ దేవి
 ప్రతాపరుద్రుడు

 ప్రతాపరుద్రుడు

ముసునూరు ప్రోలయ నాయకుడు
"ఆంధ్రదేశాధీశ్వర" మరియు "ఆంధ్రసురత్రాణ" ముసునూరు కాపయ నాయకుడు


10 comments:

  1. Durya was one of the Kamma vamsha. Kammas were Kshatriyas.3rd century ago there was kammarastram kammaratham kammanadu names.

    ReplyDelete
  2. KAMMAS hailed from CHODA, CHANUKYA, HAIHAYA & DURJAYA VAMSAS OF ANCIENT "KAMMARASTRAM / KAMMANADU"........

    ReplyDelete
  3. మల్యాల దుర్జయ వంశం:-
    మల్యాల వంశీయులు కాకతీయులకు విధేయులుగా ఉన్నారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొని కాకతీయుల విజయ సాధనకు తోడ్పడ్డారు. వీరు దుర్జయ కులస్థులు. ఈ వంశానికి ఆద్యుడు దన్నసేనాని. కటుకూరు, కొండిపర్తి, బూదపూర శాసనాలు ఇతడిని కాకతీయ సేనానిగా పేర్కొంటున్నాయి. దన్నసేనానికి ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సబ్బసేనాని సంకీసపుర రాజ్యాన్ని, రెండోవాడైన బాచసేనాని బూదపూర రాజ్యాన్ని పొందారు. సబ్బ సేనాని కుమారుడు కాటసేనాని. ఇతడికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన చౌండసేనాని ప్రసిద్ధుడు. ఇతడు గణపతి దేవుడి ఆజ్ఞ మేరకు దివిసీమపై దండెత్తి చోడియ రాజును ఓడించాడు. వెలనాటి పృథ్వీశ్వరుడి కోశాగారాన్ని గణపతిదేవుడికి అప్పగించాడు. విరియాల వంశానికి చెందిన మైలమను వివాహమాడి మల్యాల రాజ్యంతో పాటు విరియాల రాజ్యాన్ని కూడా పాలించాడు. చౌండసేనాని మల్యాల రాజ్య పాలకుడైనప్పటికీ ఓరుగల్లు దుర్గ రక్షణ కోసం ఉంచిన సైన్యాధ్యక్షుడిగా కొండపర్తిలో ఉండేవాడు. రాజ్యపాలనా వ్యవహారాలను ఇతడి అన్న పోతసేనాని చూసుకునేవాడు.
    బాచసేనాని కుమారుడు గుండ దండాధీశుడు కూడా ఈ వంశంలో ప్రసిద్ధుడు. ఇతడు గణపతిదేవుడు, రుద్రమదేవి కాలంలో సామంతుడిగా, దండనాయకుడిగా పనిచేశాడు. బూదపుర, వర్థమానపుర ప్రాంతాలపై ఆధిపత్యం వహించి కృష్ణానది ఉత్తర ప్రాంతాలను పాలించాడు. ఇతడి భార్య గోన గన్నారెడ్డి సోదరి అయిన కుప్పాంబిక(కవయిత్రి). 1276లో ఈమె వేయించిన బూదపూర శాసనాన్ని బట్టి గుండ దండాధీశుడు అప్పటికే మరణించాడని తెలుస్తోంది. తర్వాత ఇతడి కుమారులు రాజ్యపాలన చేశారు.

    విరియాల దుర్జయ వంశం:-
    కాకతీయ మొదటి బేతరాజుకు రాజ్యాన్ని ఇప్పించి కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టింది వీరే. ఈ వంశీయులు వీరులైనప్పటికీ స్వతంత్ర పాలకులు కాలేదు. రాష్ర్ట కూటులు, కల్యాణీ చాళుక్యుల వద్ద సామంతులుగా, దండనాయకులుగా పనిచేశారు. వీరు కూడా దుర్జయ కులస్థులే. విరియాల వంశానికి ఆద్యుడు పోరంటి వెన్న సేనాని. ఇతడి తర్వాత ఎర్రభూపతి, భీముడు రాష్ర్ట కూటసేనానులుగా పనిచేశారు. భీముడి కుమారుడైన ఎర్రనరేంద్రుడు విరియాల వంశంలో ప్రసిద్ధుడు. ఇతడి కాలంలోనే రెండో తైలపుడు రాష్ర్టకూటులను ఓడించి 973లో కల్యాణీ చాళుక్య రాజాన్ని స్థాపించాడు. ఎర్రనరేంద్రుడు ఇతడి సేనాని అయ్యాడు. ఆ సమయంలో ముదిగొండ చాళుక్యులు, తొలి కాకతీయులు పరస్పరం ఘర్షణ పడేవారు. అంతకు ముందే కాకతీయ నాలుగో గుండరాజు ముదిగొండ చాళుక్య బొట్టు బేతరాజును ఓడించి తమ పూర్వ రాజ్యమైన కొరవి సీమను ఆక్రమించాడు.
    తైలపుడు చక్రవర్తి కాగానే బొట్టు బేతరాజు అతడిని ఆశ్రయించాడు. చక్రవర్తి ఆజ్ఞ మేరకు విరియాల ఎర్రనరేంద్రుడు కాకతీయ నాలుగో గుండరాజును సంహరించి చాళుక్యబొట్టు బేతరాజును కొరవి సీమకు రాజును చేశాడు. ఎర్రనరేంద్రుడి భార్య అయిన కామసాని సోదరుడే గుండరాజు. కామసాని తన భర్త సహకారంతో మేనల్లుడైన మొదటి బేతరాజు(గరుడ)కు రెండో తైలపుడి నుంచి అనుమకొండ రాజ్యాన్ని ఇప్పించింది. ఈ విధంగా విరియాల వంశం కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టింది.
    ఎర్రసేనాని(నరేంద్రుడు) తర్వాత ఇతడి వంశీయులైన సూరసేనాని, బేతన, రుద్రయ రాజు, సూరన్నపతి, మల్లచమూపతి, అన్నయ మొదలైనవారు సేనానులుగా పనిచేశారు. వీరిలో కొందరు కాకతీయుల దగ్గర పనిచేశారని బి.ఎన్.శాస్త్రి తెలిపారు. కానీ ఇందుకు ఆధారాలు లభించలేదు.

    ReplyDelete
  4. రణదుర్జయులు:-
    రణదుర్జయుడు విష్ణుకుండి మాధవవర్మ సమకాలికుడు.పృథ్వీమూలుని అనంతరం పిష్ఠపురాన్ని రణదుర్జయులు ఆక్రమించి ఉంటారు. సముద్రగుప్తుని తరువాత సుమారు 375 నుండి 500 వరకు మతరకులకు చెందిన రాజుల పాలన సాగింది. ఈ వంశంలో చరిత్రకు అందిన మొదటి రాజు మహారాజా శక్తివర్మ. మొదటి విక్రమేంద్రవర్మ కాలంలో ఈ ప్రాంతం విష్ణుకుండినుల అధీనం లోకి వెళ్ళింది. 5 వ శతాబ్దపు మొదటి దశాబ్దాల నుండి దాదాపు రెండు శతాబ్దాలు వారి పరిపాలన సాగింది. అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం వారి రాజ్యం జిల్లాతో పాటు, ఇప్పటి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది. "దుర్జయ వంశానికి" చెందిన రణదుర్జయుడు, విక్రమేంద్రవర్మకు సామంతుడిగా పిష్టపురాన్ని (ఇప్పటి పిఠాపురం) పాలించాడు.వెలనాటి ప్రభువులు తాము చతుర్ధాన్వయకులులమని చెప్పుకొని యుండుట చేత వీరలు క్షత్రియులుగారనియు, శూద్రులనియు దేటపడుచున్నది. వీరు శూద్రులయినను క్షాత్రమున క్షత్రియులకు దీసిపోయిన వారుకారు. వీరలును దాము చంద్రకులులమనియు, ఇంద్రసేన వంశజులమనియు జెప్పుకొనుచున్నారు. యుధిష్ఠిర మహారాజుయొక్క దత్తపుత్త్రుడయిన యింద్రసేనుడు మధ్యదేశమును కీర్తిపురము రాజధానిగా బరిపాలించుచుండెనట. వాని వంశమునందు కీర్తివర్మయను రాజు జనించెనట. వానివంశమునందు మల్లివర్మ పుట్టెను. వానికి రణదుర్జయుడు జనించెను వానికి కీర్తివర్మ, వానికి రణదుర్జయుడు, వానికి కీర్తివర్మ పుట్టిరట. కీర్తిపుర మెచ్చటనుగానరాదు. కీర్తివర్మ నామము చాళుక్యులవంశవృక్షమునుండి గ్రహించినట్టు గానంబడుచున్నది. రణదుర్జయుడనునది బిరుదునామముగా గానంబడుచున్నది గాని నిజమైన పేరుగ గానంబడదు.

    ReplyDelete
  5. Exactly Mr. Chinnaboina.......Like you people claiming that "Golla's" are "Yadava's" of North India.....That's compleatly fake...First, u think about that...

    ReplyDelete
  6. Golla (Yadau) Gowli, Goaliga : — Gauali, Gulla, Gullai (in the Carnatic), Gollewar, Gauali, Dhangar — numerous pastoral caste of the Telugu and Carnatic Districts, found also on the eastern outskirts of the Marathawada country. Dwelling ...
    Social services in Hyderabad
    Khaja Abdul Gafoor

    ReplyDelete
  7. జాయప సేనాని తమిళ ఆయ వంశానికి చెందినవాడు.ఆయవంశం వారు యాదవులు చోళుల కొలువులొ సేనానులు ఉండి వారి దండయాత్రలో బాగం గా తెలుగు ప్రాంతానికి వచ్చినవారు.

    ReplyDelete
  8. Jayapa belongs to Ganapeswaram of Nagayalanka Mandal krishna district
    Ayyana is Avanigadda

    ReplyDelete
  9. Kakatiya and Vijayanagara rulers are undisputed Kshatriyas and not Kamma or Kapu u people claiming.
    Don't mislead History for the sake of your glory for caste.

    ReplyDelete