Thursday 5 January 2017

"ముసునూరి నాయకులు, కమ్మ దుర్జయ వంశము" - 

ముసునూరు కమ్మ నాయకుల చరిత్ర


"ముసునూరి వారి (ముసునూరి కమ్మ నాయకులు, దుర్జయ వంశము) వంశ చరిత్ర", "ఆంధ్ర (త్రిలింగ దేశ) స్వాతంత్య్రోద్యమము"....................................

"ముసునూరి వారి వంశ చరిత్ర" కు ప్రోలయనాయకుడి విలసతామ్ర శాసనం, కాపయ నాయకుడు వేయించిన పోలవరం శాసనాలు ముఖ్య ఆధారాలు. చోడభక్తిరాజు వేయించిన పెంటపాడు శాసనం, రెడ్డిరాణి అనితల్లి వేయించిన కలువచేరు శాసనాలు కూడా ప్రోలయ, కాపయలను ప్రస్తావిస్తున్నాయి."ముసునూరు" అనే గ్రామం "కృష్ణా జిల్లా"లో ఉంది. ఉయ్యూరు సమీపంలోని ముసునూరులో "కోటగోడ"ల శిథిలాలు ఈనాటికీ కనిపిస్తాయి. అందువల్ల ముసునూరే వీరి జన్మస్థానం కావొచ్చని చరిత్రకారుల అభిప్రాయం. వీరు "కమ్మ కులస్థులు, దుర్జయ వంశము". వీరి వంశకర్త "పోతననాయకుడు". అతడికి పోచ, దేవ, కామ, రాజనాయకులనే పినతండ్రులున్నారు. "వేంగీ మండలానికి" నాయకుడైన పోచ నాయకుడి కుమారుడు ప్రోలయనాయకుడు. ఇతడు అతి పరాక్రమశాలి. గోదావరి తీరంలోని మన్య ప్రాంతమైన (భద్రాచల ప్రాంతమన్య భూములు) "రేకపల్లి దుర్గం" నుంచి తన పోరాటాలను కొనసాగించాడు.......ప్రోలయ నాయకుడు ముస్లింల దాడుల్లో నష్టపోయిన అగ్రహారాలతోపాటు, వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాడు..........

ఢిల్లీ సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు జునాఖాన్-ఉలుగ్ ఖాన్(మహ్మద్ బిన్ తుగ్లక్) క్రీ.శ.1323లో ఓరుగల్లును ముట్టడించి, "కాకతీయ ప్రతాపరుద్రుడిని" బందీగా పట్టుకున్నాడు. కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానత్‌లో విలీనం చేశాడు. దీంతో ఆంధ్రదేశం తొలిసారిగా మహ్మదీయుల పాలనలోకి వెళ్లింది. మహ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లు పేరును సుల్తాన్‌పూర్‌గా మార్చినట్లు చరిత్రకారులు ఇలియట్, డాసన్ రచనల ద్వారా తెలుస్తోంది........

తనను బందీగా తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో నర్మదానదీ తీరంలో ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన విలసతామ్ర శాసనం, క్రీ.శ.1425లో రెడ్డిరాణి అనితల్లి వేయించిన కలువచేరు శాసనాలు పేర్కొంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని కందరాడ గ్రామంలో లభించిన ముసునూరి ప్రోలయనాయకుడి విలసతామ్ర శాసనం ప్రధానంగా ఆనాడు ఆంధ్రదేశంలో మహ్మదీయుల దాడులను విశదంగా వర్ణించింది.
ఆంధ్రదేశంతోపాటు హోయసాల, బల్లాల రాజ్యం, కంపిలి రాజ్యాలు తుగ్లక్‌ల ఆధీనంలోకి వచ్చాయి. ఆంధ్రదేశంలో మహ్మదీయ సైనిక పాలన సుస్థిరమైంది. పాలకులు రైతుల నుంచి అధిక పన్నులను నిర్దాక్షిణ్యంగా వసూలు చేయడం వల్ల రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఏలూరు సమీపంలో ఘియాసుద్దీన్ నాణేలు దొరికాయి. దీన్నిబట్టి క్రీ.శ.1324 నాటికి తీరాంధ్ర ప్రాంతం ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రదేశాన్ని ముస్లింల పాలన నుంచి విముక్తి చేసేందుకు "ముసునూరి నాయకులు" కృషి చేశారు. త్రిలింగ దేశాన్ని రక్షించేందుకు జరిగిన పోరాటానికి ముసునూరి ప్రోలయ నాయకుడు, అతడి తమ్ముడి కుమారుడైన ముసునూరి కాపయ నాయకుడు నాయకత్వం వహించారు.....కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసిన కొందరు నాయకులు కమ్మ దుర్జయ వంశము చెందిన ముసునూరు నాయకులు (Musunuri Nayakas) అని ప్రసిద్ధి చెందారు. కాకతీయుల తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో 'ముసునూరు కాపయ నాయకుడు' 'ముసునూరు ప్రోలయ నాయకుడు' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు...............................................................................................................................

పరిచయము
1323 సంవత్సరములో ఆంధ్ర దేశము అల్లకల్లోల పరిస్థితిలో ఉంది. ఢిల్లీ సుల్తాను పంపిన ఉలుఘ్ ఖాన్ (మహమ్మద్ బిన్ తుగ్లక్) మూడు నెలల ముట్టడి తరువాతప్రతాపరుద్రుని జయించి బంధించెను. ఓరుగల్లు నెలల తరబడి దోచబడెను. అమూల్యమైన కోహినూరు వజ్రముబంగారము, వజ్రవైఢూర్యములు మొదలగు సంపద 20,000 గుర్రములు, ఏనుగులు, ఒంటెలపై ఢిల్లీ తరలించబడెను. ప్రతాపరుద్ర మహారాజు, దుర్గపాలకుడు గన్నమ నాయుడు (యుగంధర్/మాలిక్ మక్బూల్) మొదలగు వారు బందీలుగా ఢిల్లీ తరలుచుండగా మహారాజు నర్మదా నదిలో ఆత్మహత్య గావించుకొనెను.

ముసునూరి   ప్రోలానీడు

ప్రోలయ నాయకుని విలస శాసనమందు ఆనాటి తెలుగు దేశపు దయనీయ దుస్థితి వర్ణించబడెను. అట్టి విషమ కాలమందు బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన నాయకులను ఐక్యపరచిరి. వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను ఒక కమ్మసేనానిని ఎన్నుకొనిరి. ప్రతాపరుద్రుని 72 నాయకులలో ప్రోలానీడు ఒకడు. కృష్ణా మండలములోని నూజివీడుకు చెందినవాడు. అతని తండ్రి పేరు పోచినాయకుడు. పోచినాయకునికి ముగ్గురు తమ్ములు గలరు. వారు రాజనాయకుదు, కమ్మనాయకుడు మరియు దేవనాయకుడు. దేవనాయకునికి మహావీరుడగు పుత్రుడు కాపయ నాయకుడు జన్మించెను. ముసునూరి కాపానీడు తన పినతండ్రికి చేదోడు వాదోడుగా నిలచి పేరుప్రఖ్యాతులు గడించెను.
ప్రోలానీడు నాయకులందరిని ఒక త్రాటిపై తెచ్చి ఓరుగల్లును విముక్తిగావించుటకు పలు వ్యూహములల్లెను. అతనికి ముఖ్య సహచరులుగా అద్దంకి వేమారెడ్డి, కొప్పుల ప్రోలయనాయకుడు, రేచెర్ల సింగమనాయకుడు, మంచికొండ గణపతినాయకుడు, వుండి వేంగభూపతి మొదలుగు మహావీరులు తెలుగు దేశమును పారతంత్ర్యము నుండి విడిపించుటకు సన్నద్ధులైరి. పలుచోట్ల పెక్కు యుద్ధముల పిదప 1326 లో తురుష్కులను దక్షిణభారతమునుండి తరిమివేయుటలో నాయకులు సఫలమైరి. హిందూమతము రక్షించబడెను. దేవాలయములు పునరుద్ధరించబడెను. కోటలు గట్టిబరచబడెను. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడెను.

'ఆంధ్రదేశాధీశ్వర'  'ఆంధ్రసురత్రాణ'  ముసునూరి  కాపానీడు

కాపానీడు
వయసు మీరిన ప్రోలానీడు రాజ్యాధికారమును కాపానీడికి అప్పగించి భద్రాచలం తాలుకకు తూర్పు దిషగా రెక్కపల్లి (రేఖపల్లి) కోటకు తరలిపోయెను. ముసునూరివారి విజయములచే ఉత్తేజితులై హొయసల, ద్వారసముద్రము మరియు అరవీటి రాజులు తిరుగుబాటు చేసి తిరిగి వారి వారి రాజ్యములు సాధించుకొనిరి. ఇస్లాము మతమునకు మార్చబడిన హరిహర మరియు బుక్క రాయలు హోయసల రాజ్యమును జయించి విద్యారణ్యులవారి బోధనలవల్ల తిరిగి హిందూ మతమును స్వీకరించి ఆనెగొందిలో విజయనగర రాజ్యము స్థాపించిరి. మధురలో జలాలుద్దీను హస్సను స్వతంత్రుడిగా ప్రకటించుకొనెను. సుల్తాను ఉగ్రుడై స్వయముగా పెద్దసైన్యముతో ఓరుగల్లు చేరెను. అచట ప్రబలుచున్న మహమ్మారివల్ల సుల్తానుకు అంటు జాడ్యము వచ్చింది. భయపడిన సుల్తాను తిరిగి దౌలతాబాదుకు తిరుగుముఖము బట్టెను. తనతో వచ్చిన ముల్తాను పాలకుడు మాలిక్ మక్బూల్ను ఓరుగల్లు కోటకు అధిపతిగా నియమించి ఢిల్లీకి తిరిగిపోయెను . వెనువెంటనే హోయసల రాజు సహకారముతొ కాపయ ఓరుగల్లుపై దాడి చేసి తెలంగాణమంతయును విముక్తి గావించెను. మాలిక్ మక్బూల్ ఢిల్లీకి పారిపోయెను. ఓరుగల్లు కోటపై ఆంధ్రదేశ పతాకము ఎగిరెను. కాపానీడు 'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' అను బిరుదులు పొందెను. ప్రజారంజకముగా పరిపాలించెను. తన తోటినాయకులగు వేమారెడ్డి, పిఠాపురం కొప్పుల నాయకుడు, రేచెర్ల, భువనగిరి, దేవరకొండ పద్మనాయకుల స్వతంత్రమును గౌరవించెను. కాపానీడు సామ్రాజ్యము శ్రీకాకుళం నుండి బీదరు వరకు సిరిపూరు నుండి కంచి వరకు విస్తరించెను. అది ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము.

పతనము

1345లో హసను గంగు మహమ్మదు బీన్ తుగ్లకుపై తిరుగుబాటు చేసి దేవగిరిలో బహమనీ రాజ్యము స్థాపించెను. 1347లో తన రాజధానిని గుల్బర్గాకు మార్చెను. అతని ముఖ్యోద్దేశము దక్షిణాపథమునంతయు ఆక్రమించుట. క్రమముగా తెలుగు నాయకులలో ఐక్యత సన్నగిల్లసాగెను. పాత అసూయలు, కక్షలు తిరిగి తలెత్తాయి. రేచెర్ల సింగమ నాయుడు అద్దంకిపై దండెత్తగా కాపయ కలుగచేసుకొనెను, సింగయకది నచ్చలేదు. అదేసమయాన తుగ్లక్ బహమనీ రాజ్యముపై దాడిచేయగా కాపయ సాయమందించెను. బహమనీ సుల్తాను ఎంత క్రుతఘ్నుడో కాపానీడికి త్వరలో తెలియవచ్చెను. 1350లో సింగమ నాయుని ప్రోద్బలముతోఅలావుద్దీను ఓరుగల్లుపై మొదటిసారి దండెత్తెను. ఇది ఊహించని కాపానీడు వీరోచితముగా పోరాడినను తప్పక సంధిగావించుకొని కైలాసకోటనుఅలావుద్దీనుకప్పగించెను. తుగ్లక్ 1351లో మరణించగా మిగుల ఉత్సాహముతో అలావుద్దీను పెద్దసైన్యము సమకూర్చుకొని 1355లో మరలా ఓరుగల్లుపై దండెత్తెను. ఆతనికి సింగమ నాయుడు లోపాయకారీగా సహాయపడెను. భువనగిరి సహా పెక్కు కోటలు స్వాధీనపర్చుకొని ఒక సంవత్సరముబాటు అలావుద్దీను తెలంగాణలో సర్వనాశనముగావించెను. 1359లో గుల్బర్గకు తిరిగిపోయి మరణించెను. పిమ్మట మహమ్మదు షా గుల్బర్గలో రాజయ్యాడు. అది అదనుగా కాపానీడు తన కుమారుడు వినాయకదేవుని భువనగిరి మరియు కైలాసకోటలను విముక్తి గావించుటకు పంపెను. ఆతనికి బుక్క రాయలు సాయపడెను. తొలుత విజయములు సాధించినను వినాయక దేవుడు షా సైన్యమునకు చిక్కి మహాఘాతుకముగా వధించబడ్డాడు. కాపానీడికి అదొక పెద్ద విషాదఘాతము. బుక్కరాయల సహాయముతొ కాపానీడు బహ్మనీ సుల్తానుపై పెద్ద దాడికి సన్నిద్ధుడయ్యెను. అది తెలిసి మహమ్మదు షా కోపోద్రిక్తుడై తెలంగాణపై దండెత్తెను. రాచకొండ నాయకులు అతనికి సాయమందించారని చరిత్రకారుల అభిప్రాయము. అలాంటి విషమసమయమున బుక్కరాయలు మరణించెను. విజయనగర తోడ్పాటు లేకపోయెను. కాపానీడు ఓడిపొయి గొల్లకొండ కోటను, నెమలి సింహాసనము, ఎనలేని సంపద, వజ్రవైఢూర్యములు, బంగారము సమర్పించుకొనెను. మహమ్మదు షా రెండు వర్షములు తెలంగాణను అన్నివిధములుగా నాశనము గావించి 1365లో తిరిగిపోయెను. అదే అదనుగా రేచెర్ల సింగమ నాయుడు అతని కుమారులు స్వాతంత్ర్యము ప్రకటించుకొని బలహీనపడిన కాపానీడుపై యుద్ధము ప్రకటించిరి. ఖాళీ ఐన కోశాగారముతో, యుద్ధములలో అలసిన సైన్యముతో, విషణ్ణుడైన కాపానీడు పోరుకు తలపడెను. భీమవరము వద్ద జరిగిన పోరులో తెలుగుదేశపు ఐక్యతకు, హిందూమత రక్షణకు, దక్షిణభారతమును పరదాస్యమునుండి విముక్తి చేయుటకు ఎన్నోత్యాగములుచేసిన మహామానధనుడు 1370లో అసువులు బాసెను.

ప్రాముఖ్యత

సోమశేఖర శర్మ మాటలలో: "తెలుగుదేశచరిత్రలో వారు వహించిన పాత్ర అనుపమానమైనది. వింధ్యకు దక్షిణమందుండిన గొప్ప హిందూ రాజ్యములన్నియూ ఢిల్లీ సుల్తాను మహమ్మదు బిన్ తుగ్లకు కు పాదాక్రాంతములై ఆ చక్రవర్తి మగటిమిని, సామ్రాజ్యబలమును తలయెత్తి ఎదిరింపలేని కాలమున, పూర్వపు సూర్యవంశ, చంద్రవంశజులైన క్షత్రియుల రాజ్యములన్నియు క్రుంగి కూలారిపోయిన కాలమున అంతటి మహాబలవంతుడైన ఢిల్లీ చక్రవర్తిపై కత్తికట్టి, అతని యధికారమును ధిక్కరించి, స్స్వాతంత్ర్యోద్యమమును లేవదీసి, దానిని విజయవంతముగా నడిపిన కీర్తి, ప్రతిష్ఠలు తెలుగు ప్రజానీకమువి; తెలుగు నాయకులవి; అందును ముఖ్యముగా ముసునూరి ప్రోలయ, కాపయనాయకులవి. వీరు హిందూరాజ్య పునరుద్ధరణమునకు దీక్షాకంకణములు కట్టి యవనవారధి నిమగ్నమైన తెలుగుభూమిని ఉద్ధరించిన పిదపనే దక్షిణదేశమున నుండిన ఇతర రాజ్యములకు ధైర్యము కలిగి, ఢిల్లీ సుల్తానుపై తిరుగుబాటులు కావించి విజయలక్ష్మీ సంపన్నములైనవి. హిందూదేశచరిత్రలో తెలుగు నాయకుని అధిపత్యమున తమకు తామై ప్రజలే తమ శ్రేయోభాగ్యములకొరకు అపూర్వ ధైర్యోత్సాహములతో విమత బలములను ఎదిరించి పోరాడి స్వరాజ్యమును స్థాపించుకొనిన అపూర్వ, అద్భుత ప్రకరణమిది; ప్రాచీన చరిత్రలో అశ్రుతపూర్వమైనది. ముసునూరినాయకులకు విజయమే లభించి యుండకపోయినచో మన తెలుగుదేశ చరిత్ర మరియొకతెన్నున నడచియుండెడిది. అందువలన ముసునూరి నాయకుల పరిపాలనాకాలము కొద్దిదైనను, అది మహాసంఘటనాకలితమైనది. ముసునూరివారి స్వాతంత్ర్యవిజయముతో తెలుగుదేశములో నూతన యుగము ఆరంభమైనది. తెలుగుదేశచరిత్ర ఉత్తరమధ్యయుగములో పడినది".
"ముసునూరు" అనే గ్రామం "కృష్ణా జిల్లా" ఉయ్యూరు తాలూకాలో ఉంది. ఇప్పటికీ ఈ గ్రామంలో కోట శిథిలాలు ఉన్నాయి. దీనినిబట్టి వీరి జన్మస్థలం ఇదే కావచ్చు! వీరు "కమ్మ కులస్థులు, దుర్జయ వంశము ". కాకతీయ పతనానంతరం ముస్లింల వశమైన తెలంగాణ ప్రాంతంలో చెలరేగిన అసంతృప్తిని అవకాశంగా తీసుకొని ఈ వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు భద్రాచలం ప్రాంతంలోని రేఖపల్లిని రాజధానిగా చేసుకొని ముస్లింలతో పోరాడాడు. ఈ పోరాటంలో ప్రోలయ నాయకునికి పినతండ్రి కుమారుడు కాపయనాయకుడు, వేంగి పాలకుడు వేంగ భూపాలుడు, మొదలైన వారు సహాయం చేశారు. ఇలా రేఖపల్లిలో స్వతంత్ర రాజ్య స్థాపన చేశాడు. ఇతని మంత్రి కుమారునికి అన్నయ్య మంత్రి విలాసా గ్రామం దానం చేస్తూ తామ్ర శాసనం వేయించాడు. అన్నయ్యమంత్రికి "ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసన ప్రతిష్టాపనా చార్య" అనే బిరుదు ఉంది. -ప్రోలయ నాయకునికి సంతానం లేనందువల్ల ఇతని మరణం తర్వాత కాపయ నాయకుడు రాజయ్యడు. 75 మంది నాయకుల సహాయంతో (సింగమనేడు, వేమారెడ్డి మొదలైనవారు......) ఓరుగల్లును ముట్టడించి ముస్లింలతో పోరాటం కొనసాగించి క్రీ.శ. 1336లో ఓరుగల్లును ఆక్రమించాడు. దీంతో మాలిక్ మక్బూల్ పారిపోయాడు. ఓరుగల్లు రాజధానిగా ఉత్తర తెలంగాణను కృష్ణా నది నుంచి గోదావరి వరకు గల ఉత్తర తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించాడు. విస్తరణ కాంక్షతో రేచెర్ల సింగమనేని రాజ్య భాగాలైన పిల్లలమర్రి, ఆమనగల్లు, వాడపల్లి ప్రాంతాలను ఆక్రమించి ఎరబోతు లెంకను నియమించాడు. తీరాంధ్ర ప్రాంతంలో తన ప్రతినిధులను నియమించాడు. i. కోరుకొండ్ల ప్రాంతంలో కూననాయకుడిని నియమించాడు. ii. సబ్బినాడు (కరీంనగర్) ముప్పు భూపాలుడిని నియమించాడు. -కాపయనాయకునికి ఆంధ్ర సురత్రణ ఆంధ్ర దేశాధీశ్వర అనే బిరుదులు ఉన్నాయి. -అదే సమయంలో అల్లా ఉద్దిన్ హసన్ గంగూ బహ్మనీ షా బిరుదు లేదా జాఫర్‌ఖాన్ పేరుతో 1347లో గుల్బర్గాలో బహ్మనీ రాజ్య స్థాపనలో కాపయనాయకుడు సహాయం చేశాడు. సహాయం మర్చి విశ్వాసఘాతానికి పాల్పడ్డ హసన్ గంగూ చివరికి 1350లో ఓరుగల్లుపై దాడి చేశాడు. -ఈ దాడిలో కాపయనాయకుడు కౌలాస్ (నిజామాబాద్) దుర్గాన్ని వదులుకున్నాడు. 1356 లో మరోసారి హసన్ గంగూ దాడి చేసి భువనగిరి దుర్గాన్ని ఆక్రమించుకున్నాడు. బహ్మనీలకు భువనగిరి తూర్పు సరిహద్దు అయ్యింది. కాపయనాకుడు హసన్‌గంగూ దాడులను అరికట్టాలని విజయనగర రాజు బుక్కరాయల సాయం కోరాడు. అయినప్పటికీ తన కుమారుడు వినాయక దేవుణ్ణి యుద్ధంలో కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మల్లీ హసన్‌గంగూ రెండు సేనల నాయకత్వాన హుమాయున్ సేనానిగా గోల్కొండపైకి, సప్దర్ ఖాన్ నాయకత్వాన ఓరుగల్లు పైకి దండయాత్రలకు పంపించాడు. కాపయనాయకుడు అన్నీ కోల్పోయి చివరికి బహ్మనీ సుల్తాన్‌తో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం.... -1. గోల్కొండ -2. ఓరుగల్లు దుర్గాలను సమర్పించాడు. -3. 300 ఏనుగులు, 2000 గుర్రాలు, 3 లక్షల రూపాయలు యుద్ధ పరిహారంగా చెల్లించాడు. -ఈ వరుస పరాజయాలను ఆసరాగా తీసుకుని తీరాంధ్ర రాజులు స్వతంత్రించారు. ఉత్తర తీరాంధ్ర రెడ్డిరాజుల ఆధీనంలోకి వెళ్లింది. తీరాంధ్ర చేజారిపోయే సమయంలో దక్షిణ తెలంగాణలో ఆమనగల్లు, పిల్లలమర్రి ప్రాంతాలను పాలిస్తున్న రేచెర్ల సింగమనాయుడు విజృంభించి కృష్ణానది వరకు తన రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా, కృష్ణా, తుంగ భద్ర అంతర్వేది ప్రాంతాలను కూడా ఆక్రమించాడు. -సింగమనాయకుని తర్వాత రాజైన అనపోతనాయుడు తన తండ్రి మరణానికి కారకుడైన కాపయ నాయకునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓరుగ్లు మీద దండయాత్ర చేసి 1366లో కాపయ నాయకుని చంపి భువనగిరి, ఓరుగల్లు మొదలైన దుర్గాలను స్వాధీనం చేసున్నాడు. దీంతో "ముసునూరి వంశం" అంతరించింది. దాదాపు 50 ఏండ్లు ఉత్తర తెలంగాణ ప్రాంతాలుముసునూరి పాలనలో ఉన్నాయి.
ముసునూరు ప్రోలయ నాయకుడు

 'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' ముసునూరు కాపయ నాయకుడు



మూలాలు

  1. పైకి దూకు ఆచార్య బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన బౌద్ధము-ఆంధ్రము 
  2. పైకి దూకు Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair
  3. పైకి దూకు Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London
  4. పైకి దూకు A Social History of the Deccan: 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, pp. 15-26, ISBN 0521254841
  5. పైకి దూకు India Before Europe, C. E. B. Asher and C. Talbot, 2006, Cambridge University Press, p.40, ISBN 0521809045
  6. పైకి దూకు Sastry, P.V. Parabrahma, The Kakatiyas, 1978
  7. పైకి దూకు ప్రోలానీడు విలస శాసనము: Epigraphica Indica 32: 239-268
  8. పైకి దూకు తెలుగు విజ్ఞాన సర్వస్వము, చరిత్ర, సంపుటము 2, తెలుగు విశ్వవిద్యాలయము, 1990, హైదరాబాదు
  9. పైకి దూకు Durga Prasad, History of the Andhras up to 1565 A. D., 1988 , P. G. Publishers, Guntur
  10. పైకి దూకు After the Kakatiyas, V. Yashoda Devi, 1975, Andhra Pradesh Sahitya Academy, Hyderabad
  11. పైకి దూకు A history of South India from prehistoric times to the fall of Vijayanagar, K. A. Nilakanta Sastri, 1955, Oxford Univ. Press
  12. పైకి దూకు Pre-colonial India in Practice, Cynthia Talbot, 2001, Oxford University Press, pp.177-182, ISBN 0195136616
  13. పైకి దూకు Administration and Society in Medieval Andhra (A.D. 1038-1538), C. V. Ramachandra Rao, 1976, Manasa Publications, Hyderabad, p.36




8 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. కమ్మ కులస్తులు దుర్జయ వంశస్తులు అంటానికి ఏ అధారాలు లేవు .అది ఇటివల వచ్చిన ఊహా.

    ReplyDelete
  3. #కాకతీయ #కమ్మప్రభుల #శాసనలు
    #దుర్జయ #వంశస్తులైన #కమ్మరాజుల #శాసనలు

    శాసనాధారాలను బట్టి #బయ్యారంశాశనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.

    #గూడూరుశాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కమ్మసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.

    "#గరవపాడుశాసనం" లో కాకతీయ గణపతి దేవుడు తాము దుర్జయ వంశస్తులమని దుర్జయ వంశం మూలంగా తమకి కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....

    #చేబ్రోలుశాశనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ రాణులు నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన వీర భద్రుడికి కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.

    #అల్లూరి పొతినాయుని శాసనంలో తాను దుర్జయ వంశస్థుడు అని చెప్పబడినది.

    #బెజవాడ విప్పర్ల అమరినాయుని శాసనం తాను దుర్జయ వంశస్తుడని విప్పర్ల గోత్రికుడని చెప్పబడినది.

    #మాదాల పిన్నమనాయుని శాసనంలో తాము దుర్జయులమని వల్లుట్ల గోత్రికులని చెప్పబడినది.

    #మాదాల దేవినేని ఎర్ర నాయుడు పొత్తి నాయుడు కొమ్మి నాయుడు బుద్ధ వర్మ వంశాకురాలైన వీరు దుర్జయ వంశస్తులని వల్లుట్ల గోత్రికులని చెప్పబడినది.

    #దౌర్వస దేవి పురాణంలో ప్రతాప రుద్రుఁడు కమ్మ మహారాజ వంశంలో జన్మించాడు అని రాయబడినది.

    #ప్రాతప రుద్రుడి దుర్గ పాలకుఁడు మంత్రి గన్నమ నాయుడు /యుగంధర్/ మాలికమక్బాల్ ఇతఁడు విప్పర్ల గోత్రికుడైన దుర్జయ వంశస్తుడు అని చెప్ప బడుచునది.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. జాయప సేనాని ఆయ వంశం కు చెందిన వాడు .ఆయ వంశం తమిళ ప్రాంతం నుండి చోళులతో తెలుగు ప్రాంతానికి వలస వచ్చిన యాదవ (గొల్ల) కులం. ఎర్రన భార్య కమ్మసాని కాదు కామసాని.

    ReplyDelete

    ReplyDelete
  6. దౌర్వస పురాణం అనేది ఒక బూటకపు పురాణం.దానిని పరుచూరు రామకొటయ్య అనే వ్యక్తి ఇటీవల వ్రాసిన పుస్తం.అది పూర్తిగా కల్పన.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. దుర్జయ అనేది కాకతియుల కాలములో కొంతకాలం అన్ని కులాల సైనిక నాయకులు ఉపయోగించారు. కావున దుర్జయ అనేది ఒక కుల నామం కాదు.

    ReplyDelete