Tuesday 3 January 2017

"""కాకతీయ గజసైన్యాధ్యక్షుడు,నాట్యశాస్త్రములో నిష్ణాతుడు వైరిగోధూమ ఘరట్ట జాయపసేనాని (జాయప నాయుడు) - కమ్మ దుర్జయ వంశము"""............



 "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు) :-

"జాయప నాయుడు (లేక) జాయప సేనాని" సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని వద్ద పనిచేసిన సేనాధిపతి. 1241 లో వెలనాటి చోడులపై గణపతి విజయము సాధించిన తర్వాత వెలనాడు, కమ్మనాడు లోని వీరులందరు ఓరుగల్లు కు తరలిపోయారు. అట్టివారిలో జాయప ఒకడు. గణపతి దేవుడు ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను క్షత్రియుడైన గణపతిదేవుడు పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము కమ్మ నాయకులకు జాయప ఆద్యుడు. జాయప "కమ్మ దుర్జయ వంశము" అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను దివిసీమను పాలించాడు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యములోవున్నారు.పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.వెలనాటి చోడులు గణపతిదేవుడి చేతిలో ఓడిపోవడంతో వారి వద్ద సైన్యాధిపతులుగా పనిచేసిన దుర్జయ నాయక కులాలవారు కాకతీయ సైన్యంలో చేరిపోయారు. ఆ క్రమంలో గణపతిదేవుడు కమ్మనాడు కు చెందిన జయపసేనాని ని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. జయపసేనాని కృష్ణానదీ తీరంలో గవర్నరుగా చేసిన పిన్నచోడ నాయకుని కుమారుడు.

కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద చేబ్రోలు లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు. జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను సంస్కృత గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప నాట్యములో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.‘నృత్య రత్నావళి’లో జాయప సేనాని వర్ణించిన నృత్యభంగిమల శిల్పాలు రామప్ప గుడిగోడలపై కనువిందు చేస్తాయి. ఈ శిల్పాలను ఆధారం చేసుకునే ఆచార్య నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవ నృత్యరీతిని పునరుద్ధరించారు. ఇక వేయిస్తంభాల గుడి నిర్మాణం  కాకతీయ ప్రభువు రుద్రదేవుని ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఆలయంలోని స్తంభాల దిగువన ఇసుక తప్ప ఇంకేమీ లేకపోవడం విశేషం. శతాబ్దాలు గడచినా ఈ స్తంభాలు చెక్కుచెదరకుండా నిలిచి ఉండటం అప్పటి శిల్పుల భవన నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. వేయిస్తంభాల గుడిలో శివుడు, విష్ణువు, సూర్యుడు కొలువుదీరి ఉన్నారు.

గణపతిదేవుడు రాజ్యవిస్తరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందుకోసం సైనిక బలంపైనే కాకుండా సరిహద్దు రాజ్యాల రాజకుటుంబాలతో సంబంధాలుపెట్టుకున్నాడు. 1201లో జరిగిన మొదటి దండయాత్ర లో బెజవాడ స్వాధీనము చేసుకున్నాడు. అటునుండి దివిసీమకు మరలాడు. అచట అయ్య వంశమునకు చెందిన పినచోడి పాలిస్తున్నాడు. తీవ్ర ప్రతిఘటన అనంతరము పినచోడి లొంగిపోయాడు. పినచోడి కూతుళ్ళు నారమ్మ, పేరమ్మలను గణపతి వివాహమాడి, కొడుకు జాయప సేనాని ని కాకతీయ గజసైన్యాధికారిగా నియమిస్తాడు. దీనితో వెలనాడు కాకతీయ రాజ్యములో కలిసిపోయింది. 1209 ఇడుపులపాడు (బాపట్ల తాలూకా) శాసనము ప్రకారము కమ్మనాడు, వెలనాడు ఈ దండయాత్రలో జయించబడ్డాయి. 1212లో తూర్పు తీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు.

జయపసేనాని కాకతీయ సామ్రాజ్యానికి తన విశిష్ట సేవలు అందించాడు.కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు.

వనరులు:-
  • ఆంధ్రుల చరిత్ర, చిలుకూరి వీరభద్రరావు
  • శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము - బుద్దరాజు వరహాలరాజు, 1970
  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య చౌదరి, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు, 2006.
  • బౌద్ధము-ఆంధ్రము, హనుమంతరావు, బి.యస్.యల్, 1995, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
  • నృత్య రత్నావళి.

2 comments:

  1. కమ్మ కులానికి జాయప సేనానికి సంబందం లేదు .జాయప తమిళనాడు నుండి వచ్చిన కుటుంబానికి చెందిన వాడు .వారు 'ఆయ' వంశానికి చెందిన వారు.ఆయ వంశం తమిళ గొల్ల( యాదవ)కులం.

    ReplyDelete
  2. Blackjack Casino in New Orleans
    Blackjack Casino in New 파주 출장안마 Orleans 경기도 출장샵 is one of the most popular casino 양산 출장마사지 games in New 당진 출장샵 Orleans. Enjoy a variety 천안 출장마사지 of table games to increase your winnings  Rating: 3.9 · ‎8 reviews

    ReplyDelete